Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 04:06 PM IST

 

Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా భువనేశ్వరి విమర్శించారు.

“ఓ మహిళకు గంజాయి అలవాటు చేసి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు… ఈ విషయాలపై జగన్(jagan) సిగ్గుపడాలి. ఏపీలో 2019 నుండి 2021వరకు 30,196 మంది మహిళలు మిస్ అయ్యారని చట్టసభల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్నారు. మిస్ అయిన వారిని కనిపెట్టడానికి పోలీసులు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితిలో చంద్రబాబు(chandrababu) ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు” అని భువనేశ్వరి స్పష్టం చేశారు.

కుప్పం నారీమణులకు పేరు పేరునా నా నమస్కారాలు. ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు… వారిని వంటింటికే పరిమితం చేసేవారు. స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారు. మహిళలకు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఆయనవల్లే మహిళలు నేడు రాజకీయాల్లో ముందుకెళుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు హయాంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాలలు, మూడు కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకు హైస్కూలు వీటితో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ వల్ల యువత మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు… వారి కుటుంబాలు బాగున్నాయి. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్, డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చారు.

జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు. చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు. కానీ, నేడు జగన్ పాలనలో ఆ భరోసా లేదు. ప్రొద్దుటూరులో 6 సంవత్సరాల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడితే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆర్డర్ వేస్తే… ఆ నిందితుడు ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

read also : Fali S. Nariman: నారిమన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం

దిశ యాప్, పథకం ద్వారా మహిళలకు రక్షణ ఎక్కడా దొరకడం లేదు. చట్టం కాగితాలకే పరిమితమైంది. మహిళలను మాయ చేయడానికి, మహిళలకు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికే దిశ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారు.