Srivari Padam Print : ఆ గుట్టలో శ్రీవారి పాదం ఆనవాలు.. భక్తుల ప్రత్యేక పూజలు

Srivari Padam Print : చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలో ఉన్న గోవిందరాజుల గుట్టలో  శ్రీవారి పాదముద్రలు దర్శనమిచ్చాయి. 

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 08:11 AM IST

Srivari Padam Print : చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలో ఉన్న గోవిందరాజుల గుట్టలో  శ్రీవారి పాదముద్రలు దర్శనమిచ్చాయి.  చిత్తూరు-తచ్చూరు హైవే కాంట్రాక్టర్ ఈ గుట్ట సమీపంలో మట్టి తవ్వకం పనులు చేస్తుండగా పరిశీలించేందుకు స్థానికులు అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో ఆ గుట్టలో శ్రీవారి పాదముద్ర ఉందంటూ స్థానికులు పూజలు చేశారు. దీంతో ఆ గుట్టలో ఉన్న  శ్రీవారి పాదం ఆనవాలుపై అంతటా చర్చ మొదలైంది. ఈవిషయం తెలియడంతో  దాదాపు 10 గ్రామ పంచాయతీల పెద్దలు సమావేశమై.. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా అక్కడ ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమలలోని ఏడుకొండల్లో నారాయణగిరి శిఖరం అత్యంత ఎత్తయినది. కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు తొలిసారి కాలు మోపింది ఇక్కడే అని నమ్ముతారు. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఎక్కువగా గాలులు వీస్తుంటాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుడిని ప్రార్థిస్తూ.. తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం గొడుగును (Srivari Padam Print)  ప్రతిష్టిస్తుంటుంది.

Also read : Petrol Rates: ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో రేట్స్ తెలుసుకోవాలంటే చేయండిలా..! 

ఇవాళ తిరుమలలో..

తిరుమల శ్రీవారి భక్తులకు ఈరోజు అంగ ప్రదక్షిణల టికెట్లు 10 గంటలకు విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇవాళ ఉదయం 11 గంటలకు దర్శనం, వసతి గదుల కోటా విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను ఇవాళ సాయంత్రం 3 గంటలకు జారీ చేస్తారు. రూ.300 దర్శన టికెట్లను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వసతి గదులకు సంబంధించి తిరుపతిలో గదుల్ని ఈ నెల 26న.. అలాగే 27న తిరుమలలో గదులు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ షెడ్యూల్‌ను గమనించి దర్శన టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.