B Madhusudhana Reddy : బొజ్జల కుటుంబం నాకు పోటీనే కాదు.. చంద్రబాబు, లోకేష్ ఎవరైనా నా మీద పోటీ చేసి గెలవాలి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఛాలెంజ్..

చంద్రబాబు వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్ అటాక్ గా ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 09:00 PM IST

చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రస్తుతం చిత్తూరు(Chittoor) జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పుంగనూరు ఘటన తర్వాత చంద్రబాబు శ్రీకాళహస్తి(Srikalahasthi)లో పర్యటించి అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం, అక్కడి వనరులని ఎలా దోచుకుంటున్నాడో అంటూ బియ్యపు మధుసూదన్ రెడ్డి(Biyyapu Madhusudhana Reddy)పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం అంతకుముందు టిడిపి(TDP) కంచుకోటలా ఉండేది. దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి(Bojjala Gopalakrishna Reddy) టీడీపీ నుంచి 5 సార్లు అక్కడ గెలిచారు. ఆయన మరణానంతరం 2019 లో వైసీపీ గెలుపొందింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరోసారి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నాడు. చంద్రబాబు సుధీర్ గురించి కూడా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూధనా రెడ్డిపై కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్ అటాక్ గా ఫైర్ అయ్యారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బొజ్జల కుటుంబం అసలు నాకు పోటీనే కాదు. దమ్ముంటే చంద్రబాబు లేదా ఆయన కుమారుడు శ్రీకాళహస్తిలో నాపై పోటీకి రావాలి. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. నువ్వు ఇక్కడకు రాకపోతే నిన్ను ఈశ్వరుడు వదలడు. జగన్ నిన్ను ఎలాగో కుప్పంలో గెలవనివ్వడు. ఇక్కడకు పోటీకి రా తేల్చుకుందాం అని అన్నాడు.

అలాగే.. బొజ్జల గోపాలృష్ణారెడ్డి తనకు మంచి మిత్రుడు అన్న చంద్రబాబు మరి ఆయన్ను మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పించాడో చెప్పాలి. నా కష్టంతో నాకు బొజ్జ పెరిగింది. కానీ అవినీతి సంపాదన తిని మీ బొజ్జ పెరిగింది. మీది సింగపూర్, ఎర్రచందనం, ఎర్రమట్టి, ఇసుక ఆరగించిన బొజ్జ . వేరే నియోజకవర్గం నుంచి నిన్న చంద్రబాబు పర్యటనకు మనుషులను తరలించారు. కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయక ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తిని నేను. అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కొని ఉన్నాడు. శ్రీకాళహస్తి అభివృద్ధిపై శివయ్య సాక్షిగా నేను చర్చకు సిద్దం, చంద్రబాబు చర్చకు రావాలి. ఇసుక, మట్టి అమ్మకాలు అంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అని ఆరోపించారు.

 

Also Read : AP : సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చాడు – పవన్