Site icon HashtagU Telugu

AP Capital : చివరి సమయంలో టీడీపీకి తలనొప్పిగా మారిన శ్రీ భరత్ కామెంట్స్

Sribharat Comments

Sribharat Comments

ఏపీ ఎన్నికల (AP Elections) ప్రచారం శుభం కార్డు కు వచ్చేసింది..శనివారం తో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని గట్టిగా వాడుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలతో ముంగింపు పలకాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీ (YCP) ని గద్దె దించాలని కూటమి భావిస్తుంటే..మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తుంది. ఇప్పటికే ఇరు పార్టీల మేనిఫెస్టో లతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే వైజాగ్ (Vizag Capital ) ను రాజధానిని చేస్తాం..ఇంకాస్త డెవలప్ చేస్తామని జగన్ అంటుంటే..కూటమి మాత్రం అమరావతే రాజధాని అని..దేశంలోని నెం 1 రాజధానిగా అమరావతి (Amaravathi)ని చేస్తామని అంటున్నారు. ఈ క్రమంలో వైజాగ్ కూటమి ఎంపీ అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ (Sribharat ) చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ కి తలనొప్పిగా మారుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో శ్రీ భరత్ మాట్లాడుతూ.. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అమరావతిని అభివృద్ది చేయడానికి మన దగ్గర డబ్బుల్లేవని..విశాఖ అయితే ఫాస్ట్‌గా అభివృద్ది చెందుతుందని చెప్పుకొచ్చారు. వైజాగ్ అభివృద్ది చెందింతే… రాష్ట్రం కూడా ఆటోమేటిక్‌గా అభివృద్ది చెందుతుందని శ్రీ భరత్ తెలిపారు. అమరావతిని అభివృద్ది చేయడానికి చాలా పెట్టుబడులు అవసరమని..అయితే అంత పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదని , దానితో పోలిస్తే వైజాగ్ వేగంగా అభివృద్ది చెందుతుందని శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. అమరావతి అనేది ఇప్పుడు సాధ్యం కాదని.. అది 20 సంవత్సరాల తర్వాత కథ అని ఆయన పేర్కొన్నారు. దీంతో శ్రీ భరత్ చేసిన కామెంట్స్ ను వైసీపీ వారు విపరీతంగా వైరల్ చేస్తూ..టీడీపీ అభ్యర్థులు కూడా వైజాగ్ రాజధానిగా బెస్ట్ అంటున్నారని చెప్పి శ్రీ భరత్ చేసిన కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు. ఇది టీడీపీ తలనొప్పిగా మారింది. చివరి సమయంలో భరత్ ఇలా చేశాడేంటి అని కొంతమంది టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

Read Also : AP Poll : పిఠాపురంలో వెనకడుగేసిన జగన్ .. ముందడుగేసిన పవన్