Site icon HashtagU Telugu

Green Tirumala: తిరుమ‌ల తిరుప‌తిపై ‘క‌లియుగ పురుషుడు’

Tml Ntr

Tml Ntr

ఇవాళ్టికీ తిరుమ‌ల తిరుప‌తి ప‌చ్చ‌ని చెట్ల‌తో అల‌రారుతోందంటే కార‌ణం ఏంటో తెలుసా? కార‌జ‌న్ముడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆనాడు చేసిన శాస‌నమే. తిరుమల తిరుపతి లో ధర్మ పరాయణులకే చోటని, రాజుకు శాసనాధికారం ఉన్నా అది ధర్మానికి లోబడే , ధర్మం కోసమే ఉండాలని, ధర్మ రక్షణ రాజు కర్తవ్యం అని TTD బోర్డ్ మీటింగులో చెప్పాడు. తిరుమల కొండ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశ్యంతో కొండపై బానర్లు , ప్రకటనలు , వాల్పోస్టర్లు , రాజకీయ ప్రసంగాలు , మీటింగులూ నిషేదించాడు. అవి నేటికీ అమలవు తున్నాయి. తిరుమల అటవీ ప్రాంతంగా విరాజిల్లు తున్నదీ అంటే ఆ రోజు Ntr పెట్టిన నిబంధ‌నల వల్ల ఇప్పుడు లక్షల చెట్లతో సుందరంగా ఉంది. అలాగే దిగువన ఉన్న కొండల చుట్టూ భ‌విష్య‌తులో ఆక్ర‌మ‌ణ‌లు రాకుండా ఆనాడే ఎన్టీఆర్ జాగ్ర‌త్త ప‌డుతూ జీవోలు తీసుకొచ్చాడు. తిరుమల ఔనత్యం దెబ్బ తిన‌కుండా ఆ మొత్తం ప్రాంతాన్ని కర్వర్జేషన్ జోన్ అంటే రక్షిత ప్రాంతంగా ప్రకటింప చేయించాడు. ఫ‌లితంగా తిరుమ‌ల ఏడుకొండ‌లు ప‌చ్చ‌ని చెట్ల‌తో ఇప్ప‌టికీ..ఎప్ప‌టికీ ఆహ్లాదంగా క‌నిపిస్తోంది.
ఒక యుగ పురుషుడు, పేదల పాలిట పెన్నిది , బడుగుల ఆశాజ్యోతి , స్త్రీ పక్షపాతి , ఎవరయ్యా.. అంటే NTR అని ఎవ‌రైనా చెబుతారు. మార్చ్ 28 న 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆత్మగౌరవ నినాదంతో 9 నెలలు చైతన్య రధం పై ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మంతా చుట్టి 1983 జనవరి ఎన్నికల్లో నెగ్గి మంత్రి మండలిని నెలకొల్పాడు. గెలిచిన Mla లు చాలా మంది రాజకీయ చరిత్ర లేని కొత్త ముఖాలే. అంతా యువ‌కులు..వాళ్ల‌లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లే ఎక్కువ. మంత్రులు కూడా యువకులే. 1984 లో ఆగష్ట్ లో గవర్నర్ రాంలాల్ నాదెండ్ల భాస్కర రావ్ మద్దతుతో నాటి కేంద్ర ప్రభుత్వం కథను నడిపి Ntr ని పదవీత్యుతిని చేసింది. ఇక్కడే మహోజ్వల ఘట్టం మొదలై దేశమంతా ఏక తాటిపై నిలచి అన్ని ప్రతిపక్ష పార్టీలూ Tdp కి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంతో నెల రోజులోనే మరలా సీఎంగా అధికారాన్ని సొంతం చేసుకున్నాడు Ntr.

ఇప్పటి బి. జె.పి. , అప్పటి నాయకుడు అటల్ బీహారీ వాజ్ పాయ్ రాజశక్తి పై లోకశక్తి విజయం సాధించింది అన్నారు. అలాగే Ntr ఆత్మ గౌరవానికి ప్రతిబిం బ మవ్వొచ్చు , ఆయన దేశ భక్తుడు , అచంచల జాతీయ వాద అంకిత భావంతో న్యాయ సమ్మతమైన ప్రాంతీయ ఆకాం క్షలను సమతుల్యం చేసిన ముందు తరాలకు దిక్చూచి వంటి వాడు అని Lk అద్వానీ అన్నారు. ఆ వూపులోనే జాతీయ , ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపి వి.పి. సింగ్ ని గద్దె ఎక్కించాడు. రాజకీయ అనుభవం , పాలనానుభవం లేకపోయినా ఇతరుల్లో మంచిని తీసుకుని , ఇతరుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి అమలు చేసేవాడు. ఒకసారి నిర్ణమయ్యాక ఊగిసలాట ఆస్కారమే లేదు.

ఒకసారి Ntr పై న్యాయస్థాన పరిధిలోకి రాని అంశంపై విచారణ చేసి వ్యతిరేక తీర్పు ఇస్తే ఆ తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టీస్ భాస్కరన్ పదవీ విరమణకు ఆయన గౌరవార్ధం విందు ఇచ్చి సత్కరించిన గొప్ప మ‌నిషి Ntr . అంతకు మునుపు ఏ ప్రభుత్వాలు అమలు చేయని కిలో 2 రూ. బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు , జనతా వస్త్రాలు అమలు చేసి చూపించాడు. మానవాళి అభివృద్ధికి విద్యే మూలం అని గుర్తించి 1985 విశ్వవిద్యాలయ చట్టాన్ని రూపొందించాడు. తెలుగు భాష వ్యాప్తికి తెలుగు విశ్వవి ద్యాలయాన్ని స్థాపించాడు. వైస్ చాన్స్ లర్ల ఎంపికలో మంచి నడవడిక ఉన్న వారినే తీసుకున్నాడు. ఎక్కడా రాజీ పడలేదు. కులానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అలాగే స్కూల్ పిల్లల కోసం వీడియో పాఠాలను బాపూ , రమణల చేత చిత్రీకరింప జేసి ఆ రోజుల్లోనే విడుదల చేసాడు. బి.సి, యెస్ .సి. , యస్.టి విద్యార్ధులకు గురు కులాలను ఏర్పాటు చేసాడు. నేడు అవి శాఖోప శాఖలుగా విస్థరించాయి. తెలుగు బాల , మహిళా ప్రాంగణాలు కట్టిం చాడు.

మహిళలకు ఆస్థి హక్కులో సమ భాగం ఉం డాలని పట్టుబట్టి భారత్ లోనే మొదటగా 1984 లో అమలు చేసాడు. ఇది ఆ రోజుల్లో సాహ సోపేత నిర్ణయం . దానినే కేంద్ర ప్రభుత్వం 2004 లో దేశ మంతా అమలు చట్టం చేసింది. చేగొండి హరి రామ జోగయ్య తన రాజకీయ ప్రస్థానం పుస్థకంలో కాసు బ్రహ్మానందరెడ్డి నుండి YSR వరకు నీతి, నిబ‌ద్దత, వ్యక్తిగత గుణగణాలలో మార్కు లు వేసాడు. Ntr కు 90 % , Ysr కు 20%. మార్కులు వేసాడు.
అలాగే పాల వెల్లువ పధకం . గ్రామ గ్రామాన పాల కేంద్రాల స్థాపన చేసి రైతుకు చేదోడుగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాడు. తను ఏది చేపట్టినా ఒక విప్లవాత్మక నిర్ణయంగా ఉండేది. ఎన్నో రాష్ట్రాలు ఆయన బాట పట్టాయి. కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. రాయల సీమ వాసుల కోసం తెలుగు గంగ ప్రోజెక్ట్ కావాలని పట్టుబట్టి సాధించాడు . నక్స లైట్లు కూడా దేశ భక్తులు బ్రదర్ అని దమ్ముగా ప్రకటన చేసిన వాడు Ntr . గుళ్లో పురో హితులు ఎవరైనా ఉండవచ్చు అని ధైర్యంగా నిర్ణయం ప్రక టించాడు. Ntr కు బాబాల మీ ద , మాతల మీద నమ్మకం లేదు . బుద్ధునిపై అపార విశ్వాశం ఉండేది. అందుకే హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ లో తదాగతుణ్ణి ప్రతిష్టింప జేసి , ట్యాంక్ బండ్ చుట్టూ ప్రసిద్ధులైన తెలుగు వారి విగ్రహాలు పెట్టించాడు. కులతత్వం, మతతత్వం పై తిరుగుబాటు చేసిన వాడు Ntr.

అధికారం కోల్పోయిన 1989-94 మద్య 4 సినిమాల్లో నటించి ఇలా Ntr కే సాధ్య‌మని నిరూపిం చాడు. సినీ రంగం లో గానీ, రాజకీయ రంగంలో గానీ Ntr ముద్ర కనిపించేది. నటనలో నాయకుడు, ప్రతినాయకుని పాత్రలు ఏక కాలంలో ధరించాడు. హీరోలు ప్రతి నాయకుడి పాత్రలు వెయ్యరు. అలా వేసి శభాష్ అని మెప్పించినవాడు భారత సినీ చరిత్రలో ఒకే ఒక్కడు NTR . 400 పైగా సినిమాలు నటించిన 33 ఏళ్ల సినీ జీవి తం, 13 ఏళ్ల రాజకీయ జీవితం వెరసి మొత్తం 73 సం.లు. జీవించి 1996 జనవరి 18 న దివికేగాడు. ఆయ‌న పార్టీ పెట్టి 40 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఆయన 26 వ వర్ధంతిని నేడు జరుపు కుంటున్నాం . అయినా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాడు ఎంటోడు. తాడిత పీడితుల అండ Ntr , కార్మిక – కర్షకుల నీడ Ntr , మహిళలకు – ఆడ బిడ్డలకు అన్న Ntr, ఆబాల గోపాలానికి విధ్యా ప్రధాత Ntr . ఈ తెలుగు నేల ఉన్నంత వరకూ Ntr ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు . జోహార్ NTR .