ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) వరుస తీపి కబుర్లు అందజేస్తూ ప్రజల్లో సంతోషం నింపుతున్నారు. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న బాబు..ఇటు నిరుద్యోగులకు సైతం వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా (Sports quota in government Jobs)ను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన క్రీడా పాలసీ (Sports Policy)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పలు ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా రిజర్వేషన్‌ను 2 శాతం నుండి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్‌లో కూడా 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్‌లో గ్రేడ్-3 కోచ్‌ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
ఈ కొత్త క్రీడా పాలసీని “స్పోర్ట్స్ ఫర్ ఆల్,” “నర్చర్ టాలెంట్,” “స్పోర్ట్స్ ఎకో సిస్టం,” మరియు “గ్లోబల్ విజిబిలిటీ” అనే నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ ఆధారంగా రూపొందించారు. అందరికీ క్రీడలను అందుబాటులో ఉంచడం, ప్రతిభను గుర్తించడం, ప్రపంచ స్థాయి శిక్షణను అందించడం, క్రీడా మద్దతు, సౌకర్యాలు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ సమీక్షలో విశాఖపట్నంలో ఉన్న శాప్ స్థలాన్ని తిరిగి క్రీడా అవసరాల కోసం కేటాయించాలని, రద్దయిన విద్యాధరపురం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని సీఎంను శాప్ ఛైర్మన్ రవి నాయుడు కోరారు.
Read Also : Pending Bills : మాజీ సర్పంచులకు మార్చిలోగా బకాయిలు చెల్లిస్తాం – మంత్రి పొన్నం