Telugu Desam Party: ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసందే. ఇదే ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కూటమిలో కీలక పార్టీ అయిన టీడీపీ (Telugu Desam Party)లో చీలిక మొదలైనట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి వలన టీడీపీ ఓ నియోజకవర్గంలో రెండుగా చీలిపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరించినా ఆ ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవటానికి ప్రయత్నంచటంలేదు. అయితే శనివారం ఆ ఎమ్మెల్యేనే ఇకపై తన వైఖరిని మార్చుకోనున్నట్లు ఓ మాట వదిలాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఏ నియోజకవర్గంలో టీడీపీలో చీలిక మొదలైంది..? అని రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి. దేవదత్ నిర్వహించిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, వర్ల రామయ్య హాజరయ్యారు. మరో నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొలికపూడి వద్దంటూ దేవదత్ వర్గం తీవ్ర ఆందోళన చేస్తోంది. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
Also Read: Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌కు అస్వస్థత
అయితే ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఎంపీ చిన్ని, వర్ల రామయ్య హాజరుకాకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి విధానం టీడీపీ కార్యకర్తలకు నచ్చటంలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్యేకు కాకుండా దేవదత్‌కు ఇవ్వాలని మరో వర్గం వాదిస్తోంది. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా త్వరలోనే తనకు బాధ్యతలు వస్తాయని దేవదత్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే చంద్రబాబు దేవదత్‌కు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తే అది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా.. పార్టీ వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు ఏపీ రాజకీయాల్లో లేవు. మరీ తిరువూరు టీడీపీలో ఏం జరగబోతుందా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.