భారత్–పాకిస్తాన్ (India – Pakistan ) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత సైన్యం ధైర్యంగా శత్రు మూకల దాడులను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సైనికులకు మద్దతుగా నైతికంగా నిలవాల్సిన సమయం ఇదని అభిప్రాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దేశ భద్రత కోసం ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు. త్రివిధ దళాలకు దేవుని ఆశీస్సులు లభించాలన్న ఉద్దేశంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం తమిళనాడులోని షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రం, స్వామిమలై, పలముదిరచోళైతో పాటు కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలు, ఇంద్రకీలాద్రి, పిఠాపురంలోని ప్రముఖ ఆలయాల్లోనూ ఇదే విధంగా ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ప్రతి ఆలయంలో ఒక ఎమ్మెల్యే, జనసైనికులు హాజరై పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
Uttam Kumar : నేను షో కోసం హెలికాప్టర్ వాడడం లేదు – మంత్రి ఉత్తమ్
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సైన్యానికి సూర్యశక్తి లభించాలన్న ఆకాంక్షతో ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక స్థలాల్లో , ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు. అలాగే జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ తెలిపారు.