Nara Lokesh : విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ..రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. విద్యావ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని ప్రశంసలు కురిపించారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Read Also: Indira Mahila Shakti: రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల
గత ప్రభుత్వం ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికింది. వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని రూ.5 కోట్లు ఖర్చు చేసింది. వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తా. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉంది. 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు. జీవో నెం.117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలేది కాదని అన్నారు. ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు.
కాగా, చాలా కాలంగా ఏపీలో ఉపాధ్యాయలు బదిలీల కోసం చూస్తున్నారు. ఇప్పుడీ టీచర్లందరికీ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీచర్ల బదిలీలపై కొత్త చట్టం తీసుకొస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. మార్చ్ 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే ఈ శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టవచ్చు. మొత్తానికి ఈ విద్య సంవత్సరం ప్రారంభయ్యేలోగా ఉపాధ్యాయల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Janasena : జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే !