Vijayawada : విజ‌య‌వాడలో ముమ్మ‌రంగా సాగుతున్న అంబేద్క‌ర్ స్మృతివ‌నం ప‌నులు

విజ‌య‌వాడ‌లోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హా ప‌నుల‌ను ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 07:25 AM IST

విజ‌య‌వాడ‌లోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హా ప‌నుల‌ను ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీల‌క్ష్మీ, ఇతర ఉన్న‌తాధికారులు ప‌రిశీలించారు. అంబేద్కర్ స్మృతి వనం పూర్తయితే మొఘల్ గార్డెన్స్ తరహాలో ల్యాండ్‌స్కేపింగ్, జాతీయ పక్షి నెమలి నమూనాలో రంగురంగుల పూలు, వెదురు చట్రంలో బోగెన్‌విల్లా మొక్కలు, గులకరాళ్ల నమూనాలు, అందమైన ఫుట్‌పాత్‌లు, డివైడర్లతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని స్పెషల్ సీఎస్ శ్రీల‌క్ష్మీ తెలిపారు.ముఖ్యమంత్రి వై.ఎస్. జ‌గ‌న్ అణగారిన వర్గాలు, పేదల కోసం జగన్ మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 518 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌, కాంస్యంతో 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి 500 మందికి పైగా శ్రమిస్తున్నారని.. స్మృతి వనం పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్దుతున్నామని ఆమె తెలిపారు. స్మృతి వనం కాంప్లెక్స్‌లో ఆధునిక ఏసీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ, వాటర్ పూల్స్ ఉంటాయన్నారు. అంబేద్కర్ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ప్రదర్శిస్తూ విగ్రహం చుట్టూ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు.