Site icon HashtagU Telugu

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?

AP Special Status

AP Special Status

AP Special Status: లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది. బీహార్ లో నితీష్ కుమార్ అధికారం చేపట్టగా, ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఆయన జగన్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అంశంపై కాంగ్రెస్ బీజేపీని ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చుతారా అని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్  ప్రధానిపై విరుచుకుపడ్డారు, మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందని పదేపదే చెబుతున్నారని, అయితే ఈసారి అది మోడీ 1/3 ప్రభుత్వం అని అన్నారు.

ప్రధానమంత్రికి కాంగ్రెస్‌కు నాలుగు ప్రశ్నలు సంధించింది. ఏప్రిల్ 30, 2014న తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వచ్చేలా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్నా అది జరగలేదు.. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తారా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన మంత్రి మోడీని జైరాం రమేష్ ప్రశ్నించారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తారా? అని అడిగారు. ఇక బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేరుస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు.

Also Read: Buying Property: మ‌హిళ‌ల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే బోలెడు ప్ర‌యోజ‌నాలు.. అవేంటంటే..?

Exit mobile version