Southwest Monsoon : తెలుగు రాష్ట్రాల్లోకి ‘నైరుతి’ ప్రవేశంపై క్లారిటీ

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది.

  • Written By:
  • Updated On - May 21, 2024 / 07:40 AM IST

Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది. జూన్ 5 నుంచి 11 మధ్య అవి  రాష్ట్రాన్ని తాకనున్నాయి. అంతకంటే ముందు ఈ నెలాఖరులోనే  కేరళను నైరుతి రుతు పవనాలు తాకనున్నాయి. అక్కడి నుంచి తొలుత  ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు.. రాయలసీమ నుంచి తెలంగాణకు నైరుతి చేరుకుంటుంది. ఇందుకోసం కనీసం ఐదారు రోజుల టైం పడుతుంది.

We’re now on WhatsApp. Click to Join

సగటున జూన్ 5 నుంచి 8  తేదీల మధ్య రుతు పవనాలు(Southwest Monsoon) తెలంగాణలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పరిణామం జరగడంలో ఆలస్యం చోటుచేసుకుంటే.. జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు  విస్తరిస్తాయి. ఈవివరాలను వాతావరణశాఖ నిపుణులు వెల్లడించారు. ఇక  గతేడాది వివరాలను పరిశీలిస్తే.. 2023 సంవత్సరంలో జూన్ 11న కేరళలోకి రుతు పవనాలు వచ్చాయి.  గతేడాది జూన్ 20 తర్వాతే అవి తెలంగాణలోకి విస్తరించాయి. మహా సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఈసారి నైరుతి రుతువపనాల వల్ల సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.

Also Read :Rukshar Dhillon : రుక్సర్ మెరుపులు చూశారా.. స్టార్ హీరోయిన్ కటౌట్ కానీ..?

ఢిల్లీ ప్రజలు ఎండలతో అల్లాడిపోతున్నారు. ఆదివారం రోజు ఢిల్లీలోని నజాఫ్ గఢ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 47.8 డిగ్రీలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావం ఢిల్లీలో అధికంగా ఉంది. దాదాపు 28 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. మరో వారంపాటు కూడా ఢిల్లీలో ఎండలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్‌లకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.

Also Read : Jealous Children’s : పిల్లలు సంపన్నుల పట్ల ఈర్ష్య పడతారా..? వారితో వ్యవహరించే మార్గం..!