YSRCP : వైసీపీలో ఒక‌రి గుట్టు ఒక‌రు ర‌ట్టు చేసుకుంటున్నారు – మాజీ మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 07:38 AM IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి కేసు ఫైల్ చోరీ కేసు విష‌యాన్ని ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌స్తావించారు. కేసు ఫైల్ చోరీ విష‌యంలో అన్ని వేళ్లు నీవైపే చూపిస్తున్నాయి బావా కాకాణి అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. సీబీఐ బృందాలు నెల్లూరు వ‌స్తున్నాయ‌ని.. దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని ఘోరం నెల్లూరు కోర్టులో జ‌రిగాయ‌ని.. అన్ని వేల కేసుల ఫైళ్ల‌లో ఒక్క కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఫైళ్లే చోరీకి గురైయ్యాయిని.. నువ్వు దొంగిలించావ‌ని నేను అన‌డంలేదంటూనే ఆయ‌న‌కి గ‌ట్టిగా శ్రీధ‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. బావా కాకాణి.. న‌మ్మ‌క‌ద్రోహం అంటున్నావ్‌.. అధికార పార్టీని నుంచి ప్ర‌తిప‌క్షం లోకి వ‌స్తే న‌మ్మ‌క‌ద్రోహం అంటే నిన్ను జెడ్పీ ఛైర్మ‌న్ చేసిన ఆనం కు నువ్వే చేసింది ఏంటి..? అంటూ కాకాణిని ప్ర‌శ్నించారు. వైఎస్ కుటుంబం గురించి గొప్ప‌గా మాట్లాడే అర్హ‌త మా బావా కాకాణికి ఎక్క‌డుంది..? అని శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఓదార్పు యాత్ర‌లో నీ సొంత‌మండ‌లంలో వైఎస్ విగ్ర‌హాన్ని పెట్ట‌కుండా అడ్డుకుంది నువ్వుకాదా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

అయితే వైసీపీ నేత‌ల మ‌ధ్య వాఖ్య‌ల‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ.. ఒక‌రి గుట్టు ఒక‌రు ర‌ట్టు చేసుకుంటున్నార‌న్నారు. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసులో శ్రీధ‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఈ విధంగా స్పందించారు. నెల్లూరు వైసీపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఉన్నాయని.. ఈ నేప‌థ్యంలో వారి గుట్టుల‌ను ఒక‌రికొక‌రు బ‌య‌ట‌పెట్టుకుంటున్నారన్నారు. పార్టీ హైకమాండ్ ఆమోదం లేకుండా అభ్యర్థిగా ప్రకటించే అధికారం ఎవరికీ లేదని సోమిరెడ్డి తెలివ‌పారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేతలందరితో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ యోచిస్తోందన్నారు.