Minister Posts: నారా చంద్రబాబు నాయుడు.. గొప్ప నాయకుడు. గొప్ప పాలకుడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు పరిపాలన ఎలా చేయాలనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా చంద్రబాబు పనితీరు గురించి స్టడీ చేయాల్సిందే. బ్యూరోక్రాట్ల దగ్గరి నుంచి సీఎం కార్యాలయం దాకా, సీఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ల వరకు, జిల్లా కలెక్టరేట్ల నుంచి ఎమ్మార్వో ఆఫీసుల దాకా ప్రతీచోట ఒక సిస్టమ్ నడవాలంటే సీఎంగా ఉన్నవారే దిక్సూచి. ఈ పాలనా వ్యవహారాలన్నీ చాలా క్రమశిక్షణతో నడపగలిగే సమర్ధుడు చంద్రబాబు. ఇప్పుడు ఆయన తన మంత్రివర్గం పనితీరుపై ఫోకస్ పెట్టారు. అన్ని మంత్రుల పనితీరు గురించి రిపోర్టులను తెప్పించుకొని చంద్రబాబు చెక్ చేస్తున్నారట. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి సర్కారు ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని మంత్రులను పక్కన పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. వారి స్థానంలో ఉత్సాహవంతులైన యువతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.
Also Read :Kavitha Audio Message: కవిత ఆడియో సందేశం.. ఆ అంశంపై కీలక వ్యాఖ్యలు
ఆ మంత్రులకు డెడ్‌లైన్ ?
పనితీరు అంతంత మాత్రంగానే ఉన్న మంత్రులను(Minister Posts) పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. పనితీరును మెరుగు పర్చుకునేందుకు వారికి కొన్ని నెలల టైం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అప్పటికీ వారి పనితీరు మెరుగుపడకుంటే పక్కన పెట్టనున్నారని తెలిసింది. ఈ విధంగా ఖాళీ అయ్యే మంత్రి పదవులను కొత్తవారితో భర్తీ చేయనున్నారు. జూన్ నెల మొదటి వారం తర్వాత ఈ అంశంపై చంద్రబాబు కసరత్తు మొదలుపెడుతారని అంటున్నారు. జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈజాబితాలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమకు చెందిన మంత్రులు ఉన్నారట. వారిని తప్పించి, ఆ పదవుల్లో ఆయా సామాజిక వర్గాల నేతలకే అవకాశాన్ని కల్పిస్తారని తెలుస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఈవిషయంలో ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.
Also Read :High Court CJ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్.. మరో 3 హైకోర్టులకూ..
నాగబాబుకే చంద్రబాబు ప్రయారిటీ
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇచ్చే విషయంలోనూ కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ పదవిని నాగబాబుకే ఇవ్వాలా ? జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలకు ఇవ్వాలా ? అనే దిశగా డిస్కషన్ జరుగుతోంది. అయినప్పటికీ నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వడానికే చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.