Medha Patkar : కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు.. రాజధాని ఏది? అమరావతి నిర్మాణంపై మేధా పాట్కర్..

అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం జరగలేదు. రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదు.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 08:00 PM IST

నేడు ఏపీ(AP) రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అమరావతి రైతులతో పాటు అతుల్ కుమార్ అంజన్, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్(Medha Patkar), వడ్డే శోభనాద్రీశ్వరావు, కిసాన్ సభ జాతీయ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారు. ప్రభుత్వం అమరావతి రైతులను ఇబ్బంది పెడుతుంటే వారు పోరాటం చేస్తున్నారు. అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం జరగలేదు. రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదు. అమరావతిలో ఇప్పుడు వ్యవసాయం కూడా జరగడం లేదు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏపీలో ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందులో 70 శాతం కౌలు రైతులే ఉంటున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని అంటున్నారు తప్ప ఇవ్వడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతుల కోసం, విశాఖ ఉక్కు కోసం మేము పోరాడతాం అని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, కిసాన్ సభ జాతీయ నాయకులు తెలిపారు.

 

Also Read : Telangana: నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి కేంద్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్