Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి

పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Political Parties

Political Parties

ఒకప్పుడు రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు , విమర్శలు చేసుకోవాలంటే సభల్లో , సమావేశాలను వేదికగా చేసుకునే వారు. లేదా మీడియా ముందు ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు కానీ ఇప్పుడు ఆలా కాదు పొగడ్తలైన , విమర్శలైన , ఆరోపణలైన ఇలా ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు. అయితే ఈ మాటలు అనేవి రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య రోజుకు రోజుకు చేసుకుంటున్న విమర్శలు సర్వ్త్ర విమర్శలు పాలవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ సీఎం జగన్ను కట్ డ్రాయర్ ఎమ్మెల్యే, సైకో, జలగ, వాడు అని టీడీపీ కామెంట్స్ చేస్తే.. నారా లోకేష్ ను నిక్కర్ మంత్రి, పప్పు అని వైసీపీ కామెంట్స్ చేస్తుంది. ఇలా రెండు రాజకీయ పార్టీల గొంతుకగా ఉన్న సోషల్ మీడియాలో ఇలాంటి చిల్లర కామెంట్స్ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విమర్శ సహేతుకంగా, భాషలో హుందాతనం ఉండాలి కానీ ఇలా సభ్య సమాజం ఛీ కొట్టేలా చేసుకోవొద్దని సూచిస్తున్నారు. మరి ఇకనైనా రెండు పార్టీలు కాస్త హుందాగా ప్రవర్తిస్తాయో లేదో చూడాలి.

Read Also : Kantara Rishab Shetty : జాతీయ ఉత్తమ నటుడు.. కాంతార రిషబ్ శెట్టి..!

  Last Updated: 16 Aug 2024, 02:28 PM IST