ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళలనకు గురి చేస్తున్నాయి. ప్రతి వారం లో ఎక్కడో ఓ చోట రైలు ప్రమాదానికి గురైందనే వినిపిస్తూనే ఉంది. తాజాగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడం ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది.
లింగం పల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (Janmabhoomi Express) రైలులో మంగళవారం పొగలు (Smoke In ) వెలుపడ్డాయి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ (Tadepalligudem Railway Station) కు చేరుకున్న రైలు కింది భాగం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో 20 నిమిషాల పాటు రైలును తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. బ్రేకు వేసే సమయంలో సాధారణంగా వచ్చే పొగగా రైల్వే అధికారులు నిర్ధారించారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళ్ళింది.
మొదట ఓ జనరల్ బోగీలో పొగలు రావడాన్ని ఏలూరు వద్ద గుర్తించారు. అధికారులు స్పందించి సంబంధింత మరమ్మతులు చేయడంతో పొగ రావడం ఆగిపోయింది. దాంతో, అరగంట అనంతరం రైలు ఏలూరు నుంచి బయల్దేరింది. తర్వాత తాడేపల్లిగూడెం వద్దకు చేరుకోగానే, మరో రెండు బోగీల్లో పొగ రావడం ప్రారంభమైంది. దీంతో అధికారులకు సమాచారం అందించగా ..అధికారులు చేరుకొని బ్రేకు వేసే సమయంలో సాధారణంగా వచ్చే పొగగా రైల్వే అధికారులు నిర్దారించడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే కొంతమంది మాత్రం అప్పటికే దిగి వెళ్లిపోయారు.
Read Also : Dil Raju: యానిమల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు సొంతం