అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ ఒకరు చెప్పుతో కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. 20వ వార్డు కౌన్సిలర్ మూలపర్తి రామరాజు లింగాపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యంగా అప్రోచ్ రోడ్ల సమస్యను పరిష్కరించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో రామరాజు చెప్పులు ఎత్తుకుని సభా ముఖంగా చెంపలపై కొట్టుకున్నారు.
అప్రోచ్ రోడ్డు సమస్యపై పలుమార్లు కౌన్సిల్ చైర్‌పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022 డిసెంబర్‌లో అప్రోచ్ రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ నెరవేరలేదని రామరాజు వెల్లడించారు. 30 నెలలుగా కౌన్సిలర్‌గా పనిచేసినా తన పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకున్న ఘటన ఏపీలో చర్చనీయాంశమవుతోంది.
Also Read: Varun Tej & Lavanya: ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి, హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షెన్