Site icon HashtagU Telugu

Skill Development : అసలు స్కిల్ డెవలప్ అంటే ఏంటి..? చంద్రబాబు హయాంలో ఏంజరిగింది.?

Skill Development Ap

Skill Development Ap

స్కిల్ డెవలప్ కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కావడం తో యావత్ ప్రజలు ఈ కేసు గురించి మాట్లాడుకోవడం..ఆరాతీయడం..అసలు స్కిల్ డెవలప్ అంటే ఏంటి..? దీనిని ఎవరు తీసుకొచ్చారు..? చంద్రబాబు కు స్కిల్ డెవలప్ కు సంబంధం ఏంటి..? ఈ స్కిల్ డెవలప్ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి..? స్కిల్ డెవలప్ కు ప్రభుత్వం ఎంత చెల్లించింది..? చంద్రబాబు ఫై వస్తున్న ఆరోపణలు ఏంటి..? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ స్కిల్ డెవలప్ కు సంబదించిన ఆరోపణలు..వాస్తవాలు..అప్పుడు జరిగింది ఏంటి..? అనేది మీకు తెలియజేస్తున్నాం.

స్కిల్ డెవలప్‌మెంట్‌ (Skill Development Corporation Scam):

చంద్రబాబు (Chandrababu) సీఎం గా ఉన్న హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెల్లించి.. 42 సెంటర్లు ప్రారంభించింది. ఏ సెంటర్ల ద్వారా 2.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. అయితే ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను బదలాయించారంటూ AP CID కేసు నమోదు చేసింది.

ఈ కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ – సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కానీ అసలు ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ కు అనుమతి ఇచ్చిన అజయ్ కల్లంరెడ్డి (Ajeya Kallam ) ఫై మాత్రం కేసు నమోదు చేయలేదు. ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి..లోపాలు , ప్రయోజనాలు ..ఎంతఖర్చు పెట్టారు ఇవన్నీ చుశాకనే ప్రాజెక్ట్ కు ఆమోదం తెలుపరూ.. అలాంటిది స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ కు విషయంలో ఇవేమిచేయకుండా అజయ్ కల్లంరెడ్డి ఓకే చెపుతారా..? అనేది ఇప్పుడు అందరిలో మొదలైన ప్రశ్న. అంటే ఈ కేసులో ఆయనకు కూడా సంబంధం ఉంటుంది కదా..? మరి ఆయన పేరు ఎందుకు చేర్చలేదు..? అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు.

Read Also : Balakrishna Warning : నేనొస్తున్నా.. ఎవరూ భయపడొద్దు.. అందరినీ కలుస్తా : బాలయ్య

అలాగే CID తెలిపిన దాంట్లో రూ.145 కోట్లని ఓ పేరాలో, రూ.279 కోట్లని మరో పేరాలో రాసారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది..ఎవరి ఖాతాలోకి వెళ్ళింది..? అనేది CID చెప్పలేదు. ఆలా డబ్బు ఎవరు ఖాతాలోకి వెళ్ళింది..ఎలా వెళ్ళింది అనేది చెప్పకుండా చంద్రబాబు ఫై కేసు ఎలా పెడతారనేది లాయర్లతో పాటు సగటు ప్రజలకు లేవనెత్తుతున్న ప్రశ్న. అలాగే ఈ కేసు గత 22 నెలలుగా కోర్ట్ లో నడుస్తుంది. ఈ 22 నెలల్లో చంద్రబాబు ప్రస్తావన కానీ , ఆయన పేరు కానీ బయటకు రాలేదు. సడెన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది. అది కూడా ఎన్నికల సమయంలో..? చంద్రబాబు ను అరెస్ట్ చేసిన సమయంలో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు..తీరా ACB కోర్ట్ లో విచారం సమయంలో అప్పటికప్పుడు ఆయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అంటే ఇదంతా కూడా ముందే ఓ పధకం ప్రకారం ప్లాన్ చేసి..చంద్రబాబు కు సంబంధం లేని కేసులో ఇరికించి ఆయన్ను జైలు కు తరలించాలని వేసిన ప్లాన్ అని పక్కాగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ కేసు నుండి ఎక్కడ బయటపడతారో అని మరికొన్ని కేసులు ఏసీబీ కోర్ట్ లో పెడుతున్నారు. కానీ చివరకు ధర్మమే గెలుస్తుందని యావత్ ప్రజలు అంటున్నారు.