Chandrababu Naidu : జ‌గ‌న్ కు శ్రీలంక రాజ‌ప‌క్సే గ‌తే: బాబు

ప్ర‌జ‌ల‌తో పాటు పోలీసులు కూడా తిర‌గ‌ప‌డే రోజులు ఏపీలో ఉన్నాయ‌ని చెబుతూ శ్రీలంక దేశంలో ఏపీని అభివ‌ర్ణించారు ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు.

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 03:29 PM IST

ప్ర‌జ‌ల‌తో పాటు పోలీసులు కూడా తిర‌గ‌ప‌డే రోజులు ఏపీలో ఉన్నాయ‌ని చెబుతూ శ్రీలంక దేశంలో ఏపీని అభివ‌ర్ణించారు ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు. సైన్యం, పోలీసులు కూడా ఏమీ చేయ‌లేని పరిస్థితి శ్రీలంక‌లో ఉన్న విష‌యాన్ని గుర్తు చేస్తే సేమ్ అదే సీన్ ఏపీలో త్వ‌ర‌లోనే చూస్తామ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. అంతేకాదు, శ్రీలంక మాజీ ప్ర‌ధాని మ‌హిందా రాజ‌ప‌క్సే గ‌తే ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. మ‌రోసారి పొర‌బాటున జ‌గ‌న్ కు అవ‌కాశం ఇస్తే శ్రీలంక త‌ర‌హాలో ఎమ‌ర్జెన్సీ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించ‌కుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అణచివేత ను న‌మ్ముకున్నార‌ర‌ని చంద్ర‌బాబు అన్నారు. అసమ్మతిని అణిచివేసేందుకు అన్ని హద్దులు దాటుతున్నార‌ని, ఇలాగే కొన‌సాగితే శ్రీలంక ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డిన విధంగా ఏపీ ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌స్తార‌ని ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
YSRCP ప్రభుత్వం “పోలీసు బలగాలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను అణచివేయడం” కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయుడు హెచ్చరించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభ‌ల్లో “శ్రీలంక పాలకులు భారీ రుణాలు తీసుకుని దేశాన్ని దోచుకున్నారు. ఆ దేశం దివాళా తీసింది. దీంతో ప్రజలు ప్రశ్నించగా పోలీసులను, సైన్యాన్ని వారిపై ప్రయోగించారు. పౌరులు తిరుగుబాటు చేసినప్పుడు, సైన్యం మరియు పోలీసులు ఇద్దరూ నిస్సహాయంగా ఉన్నారు. ` అంటూ చంద్ర‌బాబు పేర్కొన‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

మరో అవకాశం అడిగే హక్కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేదని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. పులివెందుల (సీఎం నియోజకవర్గం) ముఠాలు సీఎం మామ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై విచారణ కొనసాగిస్తే సీబీఐ అధికారులపై బాంబులు వేస్తామని బెదిరించే స్థాయికి వెళ్లాయి’’ అని నాయుడు ఆరోపించారు. హత్య కేసులో ‘గొడ్డలి దాడి’ని ‘గుండెపోటు’గా మార్చేందుకు ప్రయత్నించిన వారెవరో అందరికీ తెలుసు. పనికిరాని ఏపీ పోలీసులు గూండాలను అరికట్టలేక సీబీఐ కేసు పెట్టాల్సి వచ్చింది’’ అని ఆరోపించారు. నియోజకవర్గంలోని సింగలపల్లి, పోగురుపల్లి తదితర ప్రాంతాల్లో టీడీపీ అధినేత రోడ్‌షోలో ప్రసంగించారు. టీడీపీ అధినేత సిబ్బంది, విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు. యూనివర్శిటీ భూమిలో అక్రమ క్వారీయింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ ద్రావిడ విశ్వవిద్యాలయానికి చెందిన వాళ్లు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం, ఇతర సౌకర్యాలు అందడం లేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి,

టీడీపీ అధినేత వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పందిస్తూ ఇది దురుద్దేశపూరిత ప్రచారం అని అన్నారు. ప్రజలలో భయాందోళనలు సృష్టించే లక్ష్యంతో రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం వెనుక టీడీపీ దురుద్దేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం శ్రీలంకలో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌తో పోల్చ‌డంతో ప్రభుత్వం నుండి తీవ్రంగా రియాక్ట్ అయింది. మొత్తం మీద చంద్ర‌బాబుకు శ్రీలంక త‌ర‌హా దృశ్యం ఏపీలో క‌నిపిస్తోంది. ఆ వి ష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేయ‌డానికి కుప్పం రోడ్ షోల‌ను ఉప‌యోగించుకున్నారు. ప్ర‌తిగా అధికార వైసీపీ నేత‌లు కూడా బాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. దీంతో ఏపీలో శ్రీలంక వాదం బ‌లంగా వినిపిస్తోంది.