ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Case)లో సిట్ దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది.తాజాగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ ఉదయం విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటికే విజయసాయి ఏప్రిల్ 18న విచారణకు హాజరై మూడు గంటల పాటు విచారణకు ఎదురయ్యారు. సిట్ అధికారులు మద్యం విధానం, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) అమ్మకాలు, కిక్‌బ్యాక్‌ల వ్యవహారాలపై 25కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
Google AI : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఏఐ మోడ్..ఇక సమాచారం వెతకడం మరింత సులభం
విజయసాయిరెడ్డి తనను తాను ఈ స్కాంలో సాక్షిగా పేర్కొంటూ “విజిల్ బ్లోయర్” గా అభివర్ణించుకుంటున్నారు. అయితే సిట్ దృష్టిలో ఆయన పాత్ర మరింత లోతుగా ఉండే అవకాశముందని సమాచారం. ఆయన పాల్గొన్న హైదరాబాద్, విజయవాడ సమావేశాల గురించి, అలాగే అప్పటి మద్యం విధానం రూపొందించిన సమితిలో పాల్గొన్న ఇతరుల గురించి వివరించారు. ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A-1) మరియు అతని సోదరుడు, ఇతరుల నుండి హవాలా ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను విజయసాయి వివరించినట్లు సమాచారం. అయితే ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి లాభాలు పొందలేదని చెబుతున్నారు.
లిక్కర్ స్కాంలో దాదాపు 50–60 కోట్ల లంచాలు తీసుకుని వాటిని పలు కీలక వ్యక్తులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది. డికార్ట్, ఆదాన్ అనే కంపెనీలకు మద్యం సరఫరాకు సిఫార్సు చేయడం, ఔరోబిందో సంస్థ నుండి రుణం పొందడంలో సహకరించడం వంటి అంశాలు విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. ఇక ఈడీ కూడా ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు మొదలు పెట్టింది. 2019-2024 మధ్య 99,413 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలలో కేవలం 0.62 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలుగా నమోదుకావడంతో ఇది పెద్ద కుంభకోణంగా మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ దర్యాప్తు ఇంకా ఏ మేరకు విస్తరిస్తుందన్నదే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.