Chevireddy Bhaskar Reddy : మరింత చిక్కుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ

Chevireddy Bhaskar Reddy : ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మోహిత్ రెడ్డికి సోమవారం నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Chevireddy Mohith Reddy

Chevireddy Mohith Reddy

ఆంధ్రప్రదేశ్‌ను ఉలిక్కిపడేలా మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుటుంబంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy)కి నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మోహిత్ రెడ్డికి సోమవారం నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Indigo Airlines: ఇండిగో ట్రైనీ పైలట్‌కు కులదూషణలు, కెప్టెన్‌ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్

మద్యం మాఫియా కేసులో మోహిత్ రెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ వర్గాల ప్రకారం.. ఈ కేసులో ఆయనను ఏ39 నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. ఇదే సమయంలో ఇప్పటికే విచారణలో ఉన్న భాస్కర్ రెడ్డి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆయన కుమారుడిపై కూడా దృష్టి సారించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పలువురు రాజకీయ నేతలు, అధికారులు సంబంధం కలిగి ఉన్నారన్న ఆరోపణలతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పుడు మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ కావడం, భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో చెవిరెడ్డి కుటుంబం మొత్తం కేసులో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. బుధవారం జరిగే విచారణలో మోహిత్ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ కేసు తిరుపతి నియోజకవర్గ రాజకీయాలపై కూడా ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్ దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

  Last Updated: 23 Jun 2025, 12:53 PM IST