ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా సొంత పార్టీల నేతలు షాకులు ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గ మార్పులు మొదలుపెట్టారో..అప్పటి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ సర్వే ల పేరుతో టికెట్ ఇవ్వనని చెప్పడం సబబు కాదని..జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జగన్ తీరు నచ్చక పార్టీ నుండి బయటకు రాగా..మరికొంతమంది బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా తనకు టికెట్ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Singanamala MLA Jonnalagadda Padmavathi) ఫేస్‌బుక్ లైవ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే పద్మావతి అంటున్నారు. హైకమాండ్ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్లానని వివరించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని చెబితే, అలా చేస్తే ఇమేజ్ పెరుగుతుందని జగన్ చెప్పారని, అందుకు అనుగుణంగానే నడుచుకున్నామన్నారు. ఇక బస్సుయాత్రల గురించి కూడా జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్ లైవ్‌లో వ్యాఖ్యానించారు. టికెట్ ఖరారు అయినవాళ్లకే బస్ యాత్రలో పాల్గొనేలా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే తమ నియోజకవర్గానికి నీరు రావడం లేదని వాపోయింది. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని , ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పానికి తీసుకెళ్తున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్పితే.. సమస్యను పరిష్కరించింది లేదన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని.. కులాలకు, మతాలకు అతీతంగా తనను శింగనమల ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గం నుంచి కాలువలు వెళ్తున్నా.. తమ ప్రాంతం వారికి మాత్రం నీరు అందడంలేదన్నారు. ఐఏబీ మీటింగ్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.. నీళ్లు కావాలంటే సీఎం ఆఫీస్‌కి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలా..? నీళ్లకోసం మాట్లాడితే పెద్ద నేరమా..? అన్నారు. ఎస్సీ మహిళ కాబట్టి నోరు తెరిచి మాట్లాడకూడదా.. ఐదేళ్లుగా తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని.. కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదలొస్తేనే నీళ్లు ఇస్తారా.. ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? అన్నారు నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి?.. ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా? ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు.
Read Also : Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే