Site icon HashtagU Telugu

SIMS Bharat Reddy: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ‘సిమ్స్’ భరత్ రెడ్డి దంపతులు

'sims' Bharat Reddy Couple Joined Tdp In Lokesh's Presence

'sims' Bharat Reddy Couple Joined Tdp In Lokesh's Presence

 

SIMS Bharat Reddy: అధికార వైసీపీ(ysrcp)కి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన ‘సిమ్స్’ విద్యాసంస్థల(‘Sims’ educational institutions)డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు కూడా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భరత్ రెడ్డి అనుచరులు శంకర్ రెడ్డి, సిద్ధార్థ, అరవింద్, షోయబ్, దినేశ్ రెడ్డి, నవీన్ రెడ్డి, హరీశ్ రెడ్డి, మన్సూర్, మన్సూర్ గయాజ్, బేగ్, కృష్ణ, బుజ్జి, వెంకటేశ్వరరావు, నరేష్, వెంకటేశ్వరరావు, బాలయ్య, సుబ్బారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. వీరిని లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో టీడీపీ(tdp) ఘనవిజయం సాధించడం తథ్యమని అన్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా అద్భుతంగా ఉందని, టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తామని భరత్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు.

read also : Ema Datshi : దీపికా పదుకొనే ఫేవరేట్ ఫుడ్ ‘ఈమా దత్షి’ ఎలా చేయాలో తెలుసా?