సింహాచలంలో జరిగే పవిత్ర చందనోత్సవంలో విషాదం (Simhadri Appanna Swamy Temple Incident) చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చిన భక్తులు గోడ కూలిన ఘటన(Wall collapsed)లో బలయ్యారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం (Heavy rain overnight) కారణంగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోవడంతో 9 మంది భక్తులు ప్రాణాలు (Killing 9 devotees) కోల్పోయారు. పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Full Operational Freedom: పాక్‌తో యుద్ధానికి సిద్ధమైన భారత్.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణ చేపట్టి సహాయక చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కి తరలించగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తుండగా, ఉదయం 1 గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. అనంతరం స్వామివారి శరీరంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో శ్రద్ధగా వేరు చేశారు. విశేష అభిషేకాలు నిర్వహించబడిన అనంతరం ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి ప్రముఖులు స్వామిని దర్శించారు. ప్రభుత్వం తరఫున తితిదే పట్టు వస్త్రాలు సమర్పించగా, ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్ దర్శనాలు నిర్వహించారు.