Site icon HashtagU Telugu

Sikh Leaders Meet CM Jagan: సిక్కు మత పెద్దలతో సమావేశమైన సీఎం జగన్.. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

Sikh Leaders Meet CM Jagan

Resizeimagesize (1280 X 720) (1) 11zon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దల (Sikh Leaders)తో సమావేశమై సిక్కు సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో నేతలు చేసిన విజ్ఞప్తులపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలను ఆస్తిపన్ను నుండి మినహాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అన్ని గురుద్వారాలపై ఆస్తిపన్ను తొలగించాలని ఆదేశించారు. అదనంగా, సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సిక్కు పెద్ద‌లు సీఎం జ‌గ‌న్‌ను వారి సంప్ర‌దాయ ప్ర‌కారం ఘ‌నంగా స‌త్క‌రించారు.

Also Read: CBN Fire : బ్లూ,పిచ్చ మీడియాకు వార్నింగ్!`చీప్`న్యూస్ పై చంద్ర‌బాబు అస‌హ‌నం!!

Also Read: Jagan and KCR : మ‌ళ్లీ సీఎం పీఠంకోసం..స్వ‌రూపానందకు జ‌నం సొమ్ము.!

అలాగే గురుద్వారాల్లోని గ్రంధీలకు.. అర్చకులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే లబ్ధి చేకూరుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురునానక్ జయంతి రోజు అయిన కార్తీక పూర్ణిమ నాడు సెలవు ప్రకటించడాన్ని కూడా ఆయన ఆమోదించారు. దీనితో పాటు సిక్కులకు పారిశ్రామిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. MSMEల వ్యాపారాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యలను అమలు చేసేందుకు 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.