Sidharth Luthra Tweet: ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది..” అంటూ సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ ..

చంద్రబాబు కేసులో మాత్రం సిద్దార్థ్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. చంద్రబాబు ఫై పలు కేసులు నమోదు చేసిన వైసీపీ సర్కార్..ఆ కేసుల నుండి చంద్రబాబు ను బయటకు కాదు కదా..కనీసం బెయిల్ కూడా తీసుకరాలేకపోతున్నాడు

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 06:49 PM IST

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఓ కేసు పట్టుకున్నాడంటే ఆ కేసుకు తీరుగుండదని, ఆయన వాదనల ముందు ప్రత్యర్థి వర్గం షాక్ అవ్వాల్సిందే నని అంత చెపుతుంటారు. కానీ చంద్రబాబు కేసులో మాత్రం సిద్దార్థ్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. చంద్రబాబు (Chandrababu) ఫై పలు కేసులు నమోదు చేసిన వైసీపీ సర్కార్..ఆ కేసుల నుండి చంద్రబాబు ను బయటకు కాదు కదా..కనీసం బెయిల్ కూడా తీసుకరాలేకపోతున్నాడు సిద్దార్థ్. ఈ తరుణంలో సిద్దార్థ్ ఫై అంత విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా ఈయన (Sidharth Luthra Tweet:) ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చ గా మారుతుంది. ఈయన ట్వీట్ లో ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ప్రతి ఉదయం మన జీవితాలలో వెలుగును ఇస్తుంది” అని అర్ధం వచ్చేలా పోస్ట్ చేశాడు. కొద్దీ రోజుల క్రితం కూడా ట్విట్టర్ లో “న్యాయం తనకు దక్కదేమో అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైన మార్గం” అంటూ ట్వీట్ చేసి చర్చలకు కారణం అయ్యాడు. దీనిపైన కొందరు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు.

Read Also : Kumari Srimathi Trailer : అబ్దుల్ కలాం.. రజినికాంత్.. ఇటికెలపూడి శ్రీమతి..!

ఇదిలా ఉంటె స్కిల్ స్కామ్‌‌ నుంచి మాజీ సీఎం చంద్రబాబు ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించడం లేదు. ఒకదానిపై ఒకటి అన్నట్లు వైసీపీ సర్కార్ కేసులు పెడుతూనే ఉంది..వాటి నుండి బయటపడేందుకు ముందస్తు బెయిల్ అడుగుతున్న కానీ కోర్ట్ లు ఇవ్వడం లేదు. ఈరోజు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా, సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబు బాధ అంతా ఇంతా కాదు. ఈరోజు అయితే ఏకంగా లోపల నుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకోలేక జడ్జీ ముందు ఏడ్చేసినట్లు తెలుస్తుంది. 73 ఏళ్ల వయసులో..40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎంత ఘోరంగా చంద్రబాబు లేరని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.