Sidda Raghava Rao : వైసీపీలో ఊపందుకున్న రాజీనామాల పర్వం

మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 05:17 PM IST

వైసీపీ (YCP) లో రాజీనామాల పర్వం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున నేతలు రాజీనామాలు చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరి..పదవులు అందుకోగా..ఇక ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూడడంతో ఇక నేతలంతా బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే గెలిచినా 11 మందిలో పలువురు వైసీపీ కి రాజీనామా చేసి అధికార కూటమి లో చేరాలని చూస్తుండగా..ఇక మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు సైతం బయటకు వచ్చేందుకు సై అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. ఇక శిద్దా రాఘవరావు 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశాడు. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన ఈయన ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నాడు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నియమితులయ్యాడు.

Read Also : Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్‌