Site icon HashtagU Telugu

Shrimp Feed Vs Cocaine : రొయ్యల మేత వర్సెస్ కొకైన్.. వైజాగ్ డ్రగ్స్‌ కంటైనర్‌పై పొలిటికల్ వార్

Shrimp Feed Vs Cocaine

Shrimp Feed Vs Cocaine

Shrimp Feed Vs Cocaine : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ.50వేల కోట్లు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ సీపీలు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. దాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయి. విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో 25 వేల కేజీల డ్రగ్స్ ఉన్నాయని.. దాన్ని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే తెప్పించిందని గుర్తించారు. అయితే అందులో ఉన్నవి డ్రగ్స్ కాదని.. ఈస్ట్ అని సంధ్యా ఆక్వా కంపెనీ వాదిస్తోంది. రొయ్యలకు మేతగా వేసేందుకు ఆ ఈస్ట్‌ను తప్పించామని అంటోంది.  ఆ లోడ్‌ను విశాఖకు పంపిన ఐసీసీ – బ్రెజిల్ కంపెనీ కూడా అవి డ్రగ్స్ కాదని అంటోంది. అయినా రాజకీయ దుమారం మాత్రం ఆగడం లేదు. ఇంతకీ అవి డ్రగ్సా (కొకైన్)  ? రొయ్యల మేతా ?(Shrimp Feed Vs Cocaine)  అనే విషయాన్ని గురువారం సాయంత్రం నుంచి ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా తేల్చకపోవడం కొత్త వాదనలకు తావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

రాజకీయ పార్టీల నడుమ వార్..

విశాఖతీరంలో డ్రగ్స్ కంటైనర్ దొరికిపోయిన వెంటనే వైఎస్సార్ సీపీ నాయకత్వంపైకి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు ఆరోపణలు సంధించారు. దీంతో సహజంగానే వైఎస్సార్ సీపీ కూడా తనదైన శైలిలో టీడీపీపైకి ఆరోపణాస్త్రాలను వదిలింది. ఈ కేసులో కీలకంగా ఉన్న సంధ్యా ఆక్వాకు చెందిన కోటయ్య చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని వైసీపీ అంటోంది. పలువురు టీడీపీ కీలక నేతలతో సంధ్యా ఆక్వాకు చెందిన కొందరు నిర్వాహకులు దిగిన ఫొటోలను వైసీపీ తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పెట్టింది. దీనిపై వైఎస్సార్ సీపీ, టీడీపీ బృందాలు నేరుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. సంధ్య ఆక్వా ఎండీకి .. ఏపీ బీజేపీకి చెందిన ఓ అగ్రనేతకు దగ్గరి బంధుత్వం ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ వెనక వైసీపీనే ఉందని.. తమనేతలను ఇందులోకి లాగడం తగదన్నారు బీజేపీ నేతలు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు.

Also Read : Fish Fry: చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే చాలు.. టేస్ట్ వేరే లెవెల్ అంతే?

ఏడుగురు సీబీఐ అధికారుల టీమ్..

ఢిల్లీ నుంచి వైజాగ్‌కు వచ్చిన ఏడుగురు సీబీఐ అధికారుల టీమ్ ఈ వ్యవహారంపై గురువారం సాయంత్రం నుంచి లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీనికి అంతర్జాతీయ డ్రగ్ నెట్ వర్క్‌తో ఏమైనా లింకులు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తోంది. అనుమానిత పదార్థంతో కూడిన ఈ కంటైనర్‌ను బుక్ చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ఉన్నత స్థాయి సిబ్బందిపై చర్యలకు సీబీఐ సిద్ధమవుతోందని సమాచారం. ఈ డ్రగ్స్ దందా వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వెలికితీసేందుకు ఎంక్వైరీ చేస్తోంది.

Also Read :Beauty Tips: తలకు నూనె పట్టించి బయటికి వెళ్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!