తిరుమల: శ్రావణమాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈనెల 25వ తేదీన తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుగనుంది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వ్రతం జరుగుతుంది. ఈ వ్రతానికి భక్తులు నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
వ్రతం జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తామని చెప్పారు. వ్రతంలో పాల్గొనే వారు. రూ.1000 చెల్లించి టికెట్ కొనుగోలు చేయవచ్చని, ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులకు అనుమతి ఉంటుందని అన్నారు. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఈనెల 18న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ( Online Tickets) 150 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
కాగా తిరుమల నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నారుల పై చిరుతల దాడుల కారణంగా నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తరువాత నడకమార్గంలో అనుమతించటం లేదు. దీంతో చాలా మంది బస్సుల్లో తిరుమల చేరుకుంటున్నారు.
Also Read: Steel Bridge: హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి.. ప్రజా రవాణాలో మరో మైలురాయి!