Show Cause Notices : విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు లేఅవుట్ చేసిన 15.17 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్‌కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజు నోటీసులు అందాయి. నోటీసులపై వారిచ్చే సమాధాన ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ వెల్లడించారు.
Read Also: Maoists : లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు
ఇక, షోకాజ్ నోటీసులకు వచ్చే రిప్లై ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మధురవాడ సర్వే నెంబర్ 336/పీతో పాటు మరి కొన్ని నంబర్లలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా రామా నాయుడు స్టూడియోస్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.
కాగా, హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పులు చేయాలని యాజమాన్యం కోరడంతో ఈ భూమి కేటాయింపును రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, నిర్దేశిత ప్రయోజనం కోసం కేటాయించిన భూమిని వేరే అవసరాలకు ఉపయోగిస్తే దాన్ని రద్దు చేయవచ్చని స్పష్టం చేయడంతో, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోదియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ఆధారంగా కలెక్టర్ నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ స్పందిచాల్సి ఉంది.
Read Also: Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?