Shocking Videos Of Floods : కనీవినీ ఎరుగని విధ్వంసం

ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు వేల ఎకరాల్లో పంటను ముంచెత్తాయి.

  • Written By:
  • Updated On - November 23, 2021 / 11:36 AM IST

ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు వేల ఎకరాల్లో పంటను ముంచెత్తాయి. వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఏపీలో వర్షం విధ్వంసం విజువల్స్ ఇక్కడ చూడచ్చు

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 21 Nov 2021 03:11 PM (IST)

    పాపాగ్ని నది - కమలాపురం బ్రిడ్జి విజివల్స్

    పాపాగ్ని నది - కమలాపురం బ్రిడ్జి విజివల్స్

  • 21 Nov 2021 03:09 PM (IST)

    పాపాగ్ని నదిపై కూలిన బ్రిడ్జి

    పాపాగ్ని నదిపై కూలిన బ్రిడ్జి

  • 21 Nov 2021 12:23 AM (IST)

    నెల్లూరు జిల్లా పెన్నా నది వరద ఉధ్రృతితో జలదిగ్బంధనం లో చిక్కుకొన్న విద్యార్థులను

    నెల్లూరు జిల్లా పెన్నా నది వరద ఉధ్రృతితో జలదిగ్బంధనం లో చిక్కుకొన్న వెంకటేశ్వర పురం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయక బ్రృందం

  • 21 Nov 2021 12:18 AM (IST)

    Kadapa District Rain Pain

    Kadapa District's Rama Subbaiah sharing his experience of flood.

  • 20 Nov 2021 03:52 PM (IST)

    వ‌ర‌ద‌నీటిలో నెల్లూరు న‌గ‌రం...

    భారీగా కురుస్తున్న వర్షాలకు తోడు సోమశిల నుంచి పెన్నానదికి భారీగా నీరు వదులుతుండడంతో నెల్లూరులో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది, వ‌ర‌ద ధాటికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఇప్పటికే భగత్‌సింగ్‌కాలనీ, అలీనగర్‌, గాంధీగిరిజనకాలనీ ,తదితర ప్రాంతాల్లోని వందల నివాసాల్లోకి వరదనీరు చేరింది. నగర పరిధిలో ప్రధానంగా భగత్‌సింగ్‌కాలనీ ,అలీనగర్‌, జయలలితానగర్‌, అహ్మద్‌నగర్‌, పొర్లుకట్ట, వెంకటేశ్వరపురంలోని ఇస్లాంపేట, గాంధీగిరిజన కాలనీ కామాక్షినగర్ త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ నీట మునిగాయి.

  • 20 Nov 2021 03:18 PM (IST)

    వేంపల్లి సమీపంలో పాపాఘ్ని నదిలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉజ్వల్ (30) కార్మికున్ని రక్షించిన పోలీసు, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందం.

  • 20 Nov 2021 03:16 PM (IST)

    సోమ‌శిల‌, పెన్నా వ‌ర‌ద ఉదృతిని ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్...

    నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెన్నాదికి వరద ఉధృతి కొన‌సాగుతోంది. సోమ‌శిల రిజ‌ర్వాయ‌ర్ నుంచి నీటిని కింద‌కి వ‌ద‌ల‌డంతో పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. ఈ నేప‌ధ్యంలో క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు సోమ‌శిల జ‌లాశ‌యం వ‌ద్ద‌కు చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. అనంత‌రం అక్క‌డి నుంచి పెన్నా బ్రిడ్జి వ‌ద్ద‌కు వ‌ర‌ద తీవ్ర‌త‌ను ప‌రిశీలించారు. అధికారులు కూడా ఆయ‌న వెంట ఉన్నారు.
  • 20 Nov 2021 11:26 AM (IST)

    భారీ వరదల ధాటికి చిన్నాభిన్నమైన తిరుమల తిరుపతి నడక దారి

  • 20 Nov 2021 11:22 AM (IST)

    తిరుపతిలో వరద భయానక దృశ్యాలు

  • 20 Nov 2021 11:02 AM (IST)

    ✓మైలవరం డ్యాం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాకు విడుదల...

  • 20 Nov 2021 11:01 AM (IST)

    అనంతపూర్: గౌరిబిదనూరు దగ్గర ఉన్న చెరువు రాత్రి తెగిపోవడంతో పెన్నానదికి నీటిప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

  • 20 Nov 2021 10:59 AM (IST)

    చిత్రావ‌తి న‌దిలో చిక్కున్న కారు...10 మందిని కాపాడిన అధికారులు

  • 20 Nov 2021 10:58 AM (IST)

    ఉప్పొంగిన పెన్నానది , నెల్లూరు లోని పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతొంది.. ఇది నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో నేటి పరిస్థితి.. వరదనీరు ముంచెత్తడంతో , అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు..