Site icon HashtagU Telugu

Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్

Ransomware Attack

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా 3,000 మందికి పైగా కేసులు నమోదు అయ్యాయంటే తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి గత నాలుగేళ్లలో ఈ సైబర్ కేసులు నమోదైనట్టు సైబర్ క్రైమ్ వింగ్ పోలీసు సూపరింటెండెంట్ (SP) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (ఏపీసీఐడీ) వీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చార్జిషీట్‌లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ముఖ్యంగా యువతకు సూచించారు. బుక్ అయిన వారిలో 50 శాతానికి పైగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ ఆర్ ఐలు) ఉన్నట్లు సమాచారం.

సైబర్ క్రైమ్‌లు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో మహిళలపై వేధింపుల సంఘటనలు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. వారి కార్యకలాపాల ఆధారంగా సైబర్ స్టాకర్లను గుర్తించడానికి APCID అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుందని ఎస్పీ వివరించారు. ఇతర దేశాల్లో నివసించే వ్యక్తులు ఛార్జ్ షీట్ చేయబడితే, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంబంధిత రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ ఏజెన్సీలను అప్రమత్తం చేస్తారు ”అని హర్షవర్ధన్ రాజు కొనసాగించారు.

NCRB ప్రకారం.. 2021లో దేశంలో మొత్తం 5,52,972 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,885 కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. “సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్ 1930 ఏర్పాటు చేయబడింది” అని ఆయన తెలిపారు. నేరాల పట్ల అవగాహన కల్పించడానికి అక్టోబర్ 7, 8 తేదీల్లో విశాఖపట్నంలో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తామని, ఇందులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి సైబర్ క్రైమ్ రంగ నిపుణులు పాల్గొంటారని తెలిపారు.

Also Read: FB Love Story: సరిహద్దులు దాటుతున్న ప్రేమ కథ చిత్రాలు, సినిమాను తలపించే ట్విస్టులు!