AP Politics: జగన్ కు షాక్.. టీడీపీలోకి మాజీ హోంమంత్రి!

AP మాజీ హోంమంత్రి సుచరిత టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది!

  • Written By:
  • Updated On - January 6, 2023 / 12:19 PM IST

175 లక్ష్యంలో ఎన్నికలకు వెళ్లనున్న వైసీపీ (YCP) పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ పార్టీలో జగన్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే.. మంత్రుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు తూచ తప్పకుండా పాటించేవారు. కానీ ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపించే సంఖ్య అవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆనం వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత జగన్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

జీవితాంతం తాము జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan)తోనే ఉంటామని గతంలో చాలా సార్లు చెప్పిన మాజీ హోంమంత్రి (EX Home minister) మేకతోటి సుచరిత… ఇప్పుడు అందుకు కాస్త భిన్నంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. వైసీపీలోనే ఉన్నాం అంటూనే.. పార్టీ కంటే తన భర్త నిర్ణయమే తనకు ముఖ్యమని తేల్చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె భర్త దయాసాగర్‌ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నడుస్తోంది. ఆ నేపథ్యంలో తన భర్తతో పాటే తన ప్రయాణం అని సుచరిత సంకేతాలిచ్చినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నా భర్త నా నిర్ణయాలను అంగీకరించి నాతో నడిచారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ చేశారు.

ఆయన తీసుకునే నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటా. కుటుంబమంతా ఉంటే ఒకే పార్టీలో ఉంటాం. భర్త ఒక పార్టీలో, భార్య వేరొక పార్టీలో, పిల్లలు మరో పార్టీలో ఉండం. నా భర్త దయాసాగర్‌ పార్టీ మారుతాను.. నువ్వూ నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో వెళ్లాల్సిందేగా?” అంటూ సుచరిత (EX Home minister) వ్యాఖ్యానించారు. ఇన్‌కంటాక్స్ కమిషనర్‌గా పనిచేసిన దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు సుచరిత కూడా ఆయనతో పాటే నడిచేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఆమె చేసిన వ్యాఖ్యలతో ఊపందుకుంది. మంత్రి పదవి తొలగింపు నుంచి సుచరిత (EX Home minister అసంతృప్తితో ఉన్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే (YCP MLA) ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్న పాపానికి ఆయన పదవికి కత్తెరపడింది. వైసీపీ అధిష్ఠానం (YCP High Command) ఆయన్ను నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. వెంకటగిరి నియోజకవర్గంలో (Venkatagiri) నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి (Nedurumalli Ramkumar Reddy) సహకరించాలని నెల్లూరు, తిరుపతి జిల్లాల ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి లేఖలు అందాయి. ఎమ్మెల్యే ఆనం మాట వినాల్సిన పనిలేదని కూడా ఆ లేఖల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వైసీపీకి ఆనం రామనారాయణరెడ్డికి (Anam Expelled) ఎలాంటి సంబంధం లేదనే సంకేతాలను వైసీపీ అధిష్ఠానం వెల్లడించింది.

Also Read: Satya Nadella meets KTR: కేటీఆర్ తో సత్య నాదెళ్ల భేటీ.. ఐటీపై చర్చ!