Site icon HashtagU Telugu

YS Sharmila : జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్..నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను

Sharmila Jagan

Sharmila Jagan

ఏపీలో ప్రస్తుతం షర్మిల (YS Sharmila) VS జగన్ (YS Jagan) గా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజు రోజుకు మరింతగా వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం ..షర్మిల వెంట నడుస్తుండడం చేస్తున్నారు. ఇదే బాటలో మరింతమంది వైసీపీ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అలాగే షర్మిల సైతం ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టడం ఆలస్యం అన్న అని కూడా చూడకుండా జగన్ ఫై విమర్శలు సంధించడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జగన్ సైతం షర్మిల ఫై పరోక్షంగా విమర్శలకు దిగారు. నిన్న తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్లో పాల్గొన్న జగన్..APCC చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది. నేను కాంగ్రెస్ కు రాజీనామా చేశాక మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. విభజించి పాలించడం వాళ్ల నైజం. వీరికి దేవుడే గుణపాఠం చెబుతారు’ అని జగన్ ఫైర్ అయ్యారు.

ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి జగన్ కారణం. ఆయనే చేతులారా చేసుకున్నారు. దానికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ, నా కుటుంబం. సీఎం జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారు. సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు. జగన్ కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. సమైక్యాంద్ర కోసం యాత్ర చేశాను. స్వలాభం చూసుకోకుండా.. ఏది అడిగితే అది జగన్ కోసం చేశాను. ప్రజలకి మేలు చేస్తాడని నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను. కానీ అలా జరగలేదు. రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా మార్చారు. బీజేపీకి జగన్ బానిసగా మారి స్టీల్ ప్లాంట్ పణంగా పెట్టారు. రాజధాని ఉందా? లేదా? అని ప్రజలకి అర్ధం కావడం లేదు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మంది మంత్రులు అయ్యారు’ అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

‘నా కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాను. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని, విమర్శలు చేస్తారని తెలుసు. అన్ని ఆలోచించుకునే బరిలోకి దిగా. ఎమ్మెల్యేలకు కూడా సీఎం కనిపించరు. నియంతలా మారి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారు. ఎంత మంది కష్టపడి త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు. పక్కన ఉన్న వారందరీనీ ఎందుకు దూరం చేసుకుంటున్నారు. వైఎస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది’ అని షర్మిల విమర్శించారు.

Read Also : Bandla Ganesh : కేటీఆర్ కు భయం పట్టుకుంది – బండ్ల గణేష్

Exit mobile version