Site icon HashtagU Telugu

Sharmila Demand: ష‌ర్మిల కొత్త డిమాండ్‌.. జ‌గ‌న్ ఆ ప‌ని చేయ‌కుంటే రాజీనామా చేయాల్సిందే?

Sharmila

Sharmila

Sharmila Demand: వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (Sharmila Demand) మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అసెంబ్లీకి వెళ్ల‌లేక‌పోతే జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంద‌రూ రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా జ‌గ‌న్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేద‌ని ఆమె విమ‌ర్శించారు. అలాగే ప్ర‌ధాని మోదీపై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఓ ట్వీట్ వ‌దిలారు.

ష‌ర్మిల చేసిన ట్వీట్‌లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు. “బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ”. 2017లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం అన్నారు. బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు. బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు. బీజేపీ అగ్రకుల పార్టీ. అదానీ,అంబానీలకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు అని రాసుకొచ్చారు.

అలాగే ఏపీలో కూడా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143కి పెంచారు. బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానంలో నిలబెట్టారు. స్కాలర్ షిప్లు ఇచ్చారు. అందుకే బీసీలు వైఎస్ఆర్ గారిని తమ నాయకుడుగా ఓన్ చేసుకున్నారు. ఆ రోజుల్లో బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీల హక్కుల కోసం ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. కానీ వైఎస్ఆర్ గారు దీక్ష చేస్తే బీసీలను అగౌరవపరిచినట్లు అనుకున్నారు. కృష్ణయ్య పెట్టిన 17 డిమాండ్ లు ఒప్పుకున్నారు. అసెంబ్లీలో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారని రాసుకొచ్చారు.

Also Read: Balakrishna Akhanda 2 : వాటి జోలికొస్తే ఊరుకోడా.. బాలకృష్ణ అఖండ 2 కథ ఇదేనా..?

వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే.. చంద్రబాబు బీసీల ద్రోహి. 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నారు. టీడీపీ బీసీల పార్టీ అన్నారు. 40 ఏళ్ల నుంచి టీడీపీనీ మోస్తుంది బీసీలు అని చెప్పారు. బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అని మోసం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. పరిశ్రమలకు ప్రోత్సాహం అని కూడా మోసం చేశారు. బీసీల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదు..ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు. వచ్చిన 5 నెలల్లోనే విద్యుత్ బిల్లులను రూ.17 వేల కోట్లు జనాలపై మోపారు. ఇప్పటికే ఇల్లు గడవని స్థాయిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 40 శాతం అదనంగా పడుతున్న బిల్లులు భారమే కదా. బీజేపీ సైతం రాష్ట్రానికి ఇచ్చేది గుండు సున్నా. ఇచ్చిన హామీలు అన్ని పక్కన పెట్టారు. హోదా లేదు… నిధులు లేవు. కనీసం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడకుండా నిధులు కూడా ఇవ్వలేదు. అయినా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణం. బీజేపీకి గత 10 ఏళ్లుగా బాబు,జగన్ ఊడిగం చేస్తున్నారు. జగన్ సైతం బీసీలను మోసం చేశారు. నా బీసీలు అని మోసం చేశారు. ప్రతి ఏడాది రూ.15 వేల కోట్లు.. 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఇస్తా అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు రూ.75 వేలు ఇస్తా అన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ లు ఇచ్చారు కానీ వాటికి .. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీసీలకు న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాలి. ఎంత మంది బీసీలు ఉన్నారు అనేది తేలాలి. రిజర్వేషన్లు 50 శాతం కాదు .. ఎక్కువే కావాలి. కుల గణన చేస్తే న్యాయం జరుగుతుంది. కులాల వారిగా సంపదను పంచాలి. తెలంగాణలో ఇప్పటికే కులగణన జరుగుతుంది. ఏపీలో కూడా కులగణన జరిపించండి. చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన కావాలని అడిగారు.. జగన్ సైతం కులగణన చేస్తా అన్నారు. కుల గణన జరిగితేనే ఎవరు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆంధ్రలో కుల గణన జరపండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. బీసీల పక్షాన నిలబడతామ‌ని ఆమె సుదీర్ఘ పోస్ట్ చేశారు.