Site icon HashtagU Telugu

Kavitha Issue : అక్కడ షర్మిలకు తల్లి సపోర్ట్..ఇక్కడ కూతురికి కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా..?

Kavitha Sharmila Kcr Vijaya

Kavitha Sharmila Kcr Vijaya

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కుటుంబం (YSR Family ), తెలంగాణలో కేసీఆర్ కుటుంబం (KCR Family) .. ఈ రెండు రాజకీయ కుటుంబాలు ఒకప్పుడు తమ తమ రాష్ట్రాల్లో దాదాపు సంపూర్ణ ప్రభావాన్ని చూపించినవే. కానీ కుటుంబంలో ఉన్న సఖ్యత, సంఘటనల నేపథ్యంలో ఈరోజు పరిస్థితి భిన్నంగా మారింది. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి (Jagan) తన పార్టీని ప్రారంభించి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అయితే తనతో పాటు పార్టీ కోసం పోరాడిన చెల్లెలు షర్మిల(Sharmila)తో విభేదాలు నెలకొన్నాయి. ఆస్తుల పంచాయితీ నుండి మొదలైన ఈ గొడవ చివరకు రాజకీయ విడిపోయేవరకు దారి తీసింది. ఇవాళ షర్మిల కాంగ్రెస్‌లో చేరి జగన్‌కు ప్రత్యర్థిగా నిలుస్తుండగా, తల్లి విజయమ్మ (Vijayamma)ఆమెకు మద్దతుగా నిలవడం కుటుంబ విభేదాలను మరింత స్పష్టం చేస్తోంది.

Electricity Bill: క‌రెంట్ బిల్లు ఎక్కువ‌గా వ‌స్తుందా? అయితే ఈ త‌ప్పు చేస్తున్నారేమో చూడండి!

ఇదే తరహాలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ (KCR) కుటుంబంలోనూ ఆంతర్య పోరు తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో సీఎం పదవికి వారసుడు ఎవరు అనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల బీఆర్ఎస్‌లో అసంతృప్తి తలెత్తింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ (KTR) కి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండడం తో కూతురు కవిత (Kavitha) తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం, లేఖ రూపంలో తన అభిప్రాయాలను పంచుకోవడం పార్టీపై, కుటుంబంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, బహిరంగ ప్రవర్తన బీఆర్ఎస్‌లో భవిష్యత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

ఈ రెండు కుటుంబాల్లో తల్లిదండ్రుల వైఖరి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వైఎస్ఆర్ ఫ్యామిలీలో తల్లి విజయమ్మ కూతురికే మద్దతుగా ఉండగా, కేసీఆర్ మాత్రం తన వారసత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కుటుంబ బంధాలు రాజకీయాల కంటే బలమైనవే అయినా, అధికారం కోసం సాగుతున్న ఈ పోరాటాల్లో అవి పక్కకు పోయాయి. ఈ కుటుంబ కలహాలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో, దాని ప్రభావం రాజకీయ సమీకరణలపై ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.