Site icon HashtagU Telugu

YSR Name Change : విద్యాసంస్థలకు YSR పేరును తొలగించడాన్ని తప్పు పట్టిన వైస్ షర్మిల

Sharmila Who Took The Blame

Sharmila Who Took The Blame

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల పేర్లు మార్చడం తో పాటు విద్యాసంస్థలకు ఉన్న వైస్సార్ పేరు ను కూడా తొలగించింది. దీనిపై కూటమి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుంటే..వైస్సార్ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైస్సార్ కూతురు , ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల..కూటమి ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆనాడు పెద్ద తప్పు చేస్తే… ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత ఇప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌(ఎక్స్‌) వేదికగా ఘాటుగా స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలకు, కాలేజీ ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నామని షర్మిల అన్నారు. NTR అయినా, YSR అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని, పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని గుర్తు చేసారు. వాళ్లిద్దరినీ రాజకీయాలకు అతీతంగానే చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదని హితవు పలికారు.

వైఎస్‌ఆర్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉచిత కరెంట్, పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శమని షర్మిల కొనియాడారు. వైఎస్‌ఆర్‌ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదని.. తెలుగు వారి ఆస్తి అని , తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలంగానే ఉందని , YCP మీద ఉన్న కోపాన్ని YSR మీద రుద్దడం సరికాదని అన్నారు. YCPలో YSR లేడు అని. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే అవుతుందని ఎద్దేవా చేశారు.

Read Also : Ex Minister Roja : వైసీపీ ని వీడడం ఫై మాజీ మంత్రి రోజా క్లారిటీ