YS Sharmila : ఆర్కే కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల

వైస్ షర్మిల (YS Sharmila)..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Alla Ramakrishna Reddy) కు ధన్యవాదాలు తెలిపింది. తన పట్ల, వైఎస్సార్ (YSR) కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక […]

Published By: HashtagU Telugu Desk
Rk Sharmil

Rk Sharmil

వైస్ షర్మిల (YS Sharmila)..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Alla Ramakrishna Reddy) కు ధన్యవాదాలు తెలిపింది. తన పట్ల, వైఎస్సార్ (YSR) కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు (మంగళవారం) లోటస్‌ పాండ్‌లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు. ఈనెల 4న కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమని షర్మిల స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు షర్మిల సూచించారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. ఇక వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… తన రాజకీయ ప్రస్థానం వైఎస్ షర్మిలతోనే అని ఇటీవల ప్రకటించగా… ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే, తాను కూడా ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళతానని వివరించారు. ఆర్కే వ్యాఖ్యలపై మీడియా షర్మిలను ప్రశ్నించగా.. తన పట్ల, వైఎస్సార్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also : Puthalapattu MLA MS Babu : సీఎం జగన్ ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆగ్రహం

  Last Updated: 02 Jan 2024, 02:37 PM IST