Site icon HashtagU Telugu

YS Sisters Meet: వైఎస్‌ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల

YS Sisters Meet

YS Sisters Meet

YS Sisters Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ షర్మిల వైఎస్‌ సునీతారెడ్డిని కలిశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా వైఎస్ఆర్ కడపకు వచ్చిన షర్మిల సునీతారెడ్డిని కలిశారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వారిద్దరూ కలిసి వెళ్లారు. సమాధి వద్ద మాజీ సీఎం వైఎస్ఆర్ కి నివాళులు అర్పించారు.

2019 ఎన్నికలకు కొన్ని వారాల ముందు హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఈ కేసులో సీబీఐ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చింది. ఈ కేసులో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అయితే సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.తండ్రి హత్య కేసులో ఉన్న బంధువులను రాజకీయంగా నిలదీయాలని సునీత యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో వైఎస్సార్‌సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని నిందితులుగా చేర్చారు. భాస్కర్ రెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదలైనప్పటికీ సునీత బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని బరిలోకి దింపడం పట్ల వివేకానందరెడ్డికి అనుకూలం కాకపోవడంతో హత్యకు కుట్ర పన్నినట్లు సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులు కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య సిద్ధం.. ప్రాక్టీస్ మొదలు

Exit mobile version