YS Sharmila : అన్నతో ముగిసిన చెల్లెమ్మ భేటీ..

ఏపీ సీఎం జగన్ (Jagan) తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల (Sharmila) దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ అయ్యింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరింది. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. దాదాపు 25 నిమిషాల పాటు తాడేపల్లి నివాసంలో ఉన్న షర్మిల.. తాడేపల్లి నుండి విజవాడ నోవోటల్ హోటల్ చేరుకుంది. షర్మిలతో పాటు సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం వెళ్లారు. […]

Published By: HashtagU Telugu Desk
Sharmila Meets Jagan

Sharmila Meets Jagan

ఏపీ సీఎం జగన్ (Jagan) తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల (Sharmila) దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ అయ్యింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరింది. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. దాదాపు 25 నిమిషాల పాటు తాడేపల్లి నివాసంలో ఉన్న షర్మిల.. తాడేపల్లి నుండి విజవాడ నోవోటల్ హోటల్ చేరుకుంది. షర్మిలతో పాటు సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా షర్మిల కాన్వాయ్ వెళ్లాక ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే.. సమాచారం లేకపోవడంతో సీఎం ఇంటి వైపు ఆర్కే వాహనం వెళ్లకుండా పోలీసులు గేటు వేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి ఆర్కేను పోలీసులు పంపించారు. మరికొద్ది సేపట్లో షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి (Rajareddy) ఎంగేజ్‌మెంట్ జనవరి 18న అట్లూరి ప్రియతో జరగనుండగా వివాహం ఫిబ్రవరి 17న ఫిక్స్ అయింది.

Read Also : Hyderabad: మైనర్ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్

  Last Updated: 03 Jan 2024, 07:02 PM IST