Site icon HashtagU Telugu

AP : జగన్ కు మళ్లీ ఓటేస్తే మిమ్మల్నే అమ్మేస్తారు – వైఎస్ షర్మిల

Sharmila Jagan

Sharmila Jagan

ఎన్నికల ప్రచారంలో జగన్ (Jagan) విషయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ తగ్గేదేలే అంటుంది. అన్న టార్గెట్ అన్నట్లు ఆమె విమర్శలతో చెమటలు పట్టిస్తుంది. ఈరోజు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పార్టీష్టించిన ఆమె..మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారని ఘాటైన వ్యాఖ్యలే చేసింది. గత ఎన్నికల్లో జగన్ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ..ఈసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను అధికారంలోకి రాగానే 2.25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్..అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు కానీ.. జగన్ మాత్రం నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ఆరోపించారు. మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది.

జగన్ పాలనలో రాష్ట్రంలోని రైతులు అప్పులపాలయ్యారని ఆరోపించారు. రైతులకు పంట నష్ట పరిహారం, గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో నారాయణస్వామి.. అంబేద్కర్ వారసుడిగా చెప్పుకుంటూ కల్తీ మద్యం అమ్ముతారా అని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు, ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

Read Also : IPL 2024 : SRH సిక్సర్ల జాతర..RCB టార్గెట్ 288