Site icon HashtagU Telugu

BJP అంటే ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్’ -కొత్త అర్ధం చెప్పిన షర్మిల

Bjp Means Babu Jagan Pa

Bjp Means Babu Jagan Pa

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు పార్టీలను మూడు చెరువుల నీళ్లు తాగించేలా తన మాటలతో చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం తన దూకుడును కనపరుస్తుంది. తెలంగాణ లో ఎలాగైతే పార్టీ ప్రకటించి అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడిందో..ఇప్పుడు ఏపీలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. తన అన్న జగన్ చదివిన స్క్రిప్టే మళ్లీ మళ్లీ చదవి బోర్ కొట్టిస్తే..షర్మిల మాత్రం ఎప్పటికప్పుడు..ఏ వేదికకు ఆ వేదికగా స్క్రిప్ట్ ను చేంజ్ చేస్తూ అన్ని పార్టీల ఫై విరుచుకుపడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఏపీలో బిజెపి కి కొత్త అర్ధం చెప్పి అబ్బా అనిపించింది. BJP అంటే ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్’ అని , ఇతర రాష్ట్రాల్లో బిజెపి ఒక అర్ధం ఉంటె..ఏపీలో మాత్రం బిజెపి అంటే అర్ధం ఇదే అంటూ తనదైన శైలి లో విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. కొద్దీ సేపటి క్రితం కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల ప్రకాశం జిల్లా మద్దిపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను సందర్శించారు. వైస్సార్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కనీసం నిర్వహణ కోసం నిధులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రికి కనీసం ఏ ప్రాజెక్ట్ కూడా తెలియదని , కేవలం సంక్రాంతి డాన్సులు వేయడం తప్ప మరొకటి తెలియదని మంత్రి అంబటి రాంబాబు ఫై విమర్శలు సంధించారు.

Read Also : Venkatesh Meets CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో వెంకటేష్..