AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల (Sharmila ) ఫైరయ్యారు. ‘సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా? వాళ్లను రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా? చేసిన తప్పే YCP మళ్లీ మళ్లీ చేస్తోంది అంటూ షర్మిల మండిపడ్డారు. సజ్జల (Sajjala ) మహిళలను అవమానించే భాషలో మాట్లాడుతున్నారని, ఇది వారికీ కొత్తమీ కాదని గతంలో ఎంతోమందిని అన్నారని షర్మిల చెప్పుకొచ్చింది. ఆడవారిని ‘పిశాచులు’, ‘రాక్షసులు’ అని పేర్లతో పిలుస్తారా..? ఇదేనా మహిళలకు ఇచ్చే సంస్కారం..? అంటూ ప్రశ్నించారు షర్మిల.
CM Revanth Reddy : రాహుల్, ఖర్గేతో రేవంత్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ..!
తనపై కూడా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసారని, జగన్ మోహన్ రెడ్డి నా అక్కచెల్లెళ్లను గౌరవిస్తానని చెపుతాడు..సొంత చెల్లెను నాకే గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రంలో మహిళలకు ఇస్తాడా..? అని షర్మిల ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యల వల్ల సమాజంలో స్త్రీలు అనుభవించే అసౌకర్యాలను షర్మిల్ ఎత్తి చూపారు. మహిళలు, బలహీన వర్గాల పట్ల వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో సజ్జల , వైసీపీ మీడియా వారు చేస్తున్న వ్యాఖ్యలు చెప్పకనే చూపుతున్నాయని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు..మరో రెండు నమోదు
మరోపక్క అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివారావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్రముఖ టీవీ ఛానల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను కొమ్మినేని సమర్థించినట్లు ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు.