వైసీపీ అధినేత, మాజీ సీఎం , అన్న జగన్ (YS Jagan) పై షర్మిల (YS Shaarmila) మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించింది. బుధువారం కడపలో పర్యటించిన ఆమె జగన్ , అవినాష్ లపై తీవ్రస్థాయి లో విమర్శలు చేసారు. అసెంబ్లీ కి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తే..ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తా అని జగన్ అనడం పై ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్… ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించింది. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని , పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్సార్ దీన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని , మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని అన్నారు.
Read Also : US Vs Russia : అమెరికాకు రష్యా భయం.. ఉక్రెయిన్ రాజధానిలో ఎంబసీకి తాళం