AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదల్ని ఆమోదించింది. వీటిని గర్వంగా […]

Published By: HashtagU Telugu Desk
Sai Sharmila

Sai Sharmila

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదల్ని ఆమోదించింది. వీటిని గర్వంగా పేర్కొంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనికి వైఎస్ షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘వైజాగ్ సమ్మిట్ నుంచి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి..? రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డ్తో రాగలదా..? అలాగే మీ హయాంలో పోయిన పెట్టుబడుల గురించి చెప్పండి..? ఈ ఏడాది దావోస్ వెళ్లొద్దని మీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుంది..? అని ఆమె ప్రశ్నలు సంధించారు.

అంతకు ముందు విజయసాయి ఏమని ట్వీట్ చేసాడంటే.. సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. 5300 ఉద్యోగాల కల్పనతో ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేస్తూ ఇంధన పరిశ్రమలు స్దాపించేందుకు రూ.22302 కోట్ల ప్రతిపాదనల్ని ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రతిపక్షం తన నెగెటివ్ ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చని, తాము తమ మంచి పనుల్ని కొనసాగిస్తామని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also : Ayodhya : కాలినడకన వచ్చి అయోధ్య రామయ్య ను దర్శించుకున్న ముస్లింలు

  Last Updated: 31 Jan 2024, 09:18 PM IST