Site icon HashtagU Telugu

YS Sharmila : జగన్ నీ మూర్ఖత్వానికి నిన్ను మ్యూజియంలో పెట్టాలి – వైస్ షర్మిల

YS Jagan and Sharmila fight for YSR Inheritance on YSR Birth Anniversary

YS Jagan Sharmila

వైస్ షర్మిల (YS Sharmila)..వైసీపీ అధినేత, మాజీ సీఎం , తన అన్న జగన్ (Jagan) ను వదలడం లేదు. ఎన్నికల ముందు ఎలాగైతే టార్గెట్ చేసిందో..ఇప్పుడు ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనప్పటికీ జగన్ ను వదలడం లేదు. సోషల్ మీడియా వేదికగా తరుచు చివాట్లు పెడుతూనే ఉంది. జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రజల సమస్యల ఫై అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలనీ..అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటె ఎలా అంటూ ప్రశ్నించింది. దీనికి గాను వైసీపీ షర్మిల ఫై ఘాటైన వ్యాఖ్యలే చేసింది. దీనికి గాను తాజాగా షర్మిల వైసీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసెంబ్లీకి వచ్చి నిలదీయండని అంటే, చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని జగన్ ఫై షర్మిల సెటైర్ వేశారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకేనని.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని పేర్కొంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడని ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాలో తనను కించపర్చేంత ద్వేషం జగన్ కు ఉందని, తనకు ద్వేషం లేదని అన్నారు.కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం తనకు ఉందంటూ షర్మిల వాపోయింది . ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తనకు ఉందని, అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని అన్నారు.జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నామని, చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నామని అన్నారు.

ఇంకా షర్మిల ఏమన్నదంటే..”జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు.

సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!

వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు.
@YSRCParty
YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం
Y అంటే వైవీ సుబ్బారెడ్డి,
S అంటే సాయిరెడ్డి,
R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు.
కనుక వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ.

మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫి చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ? 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..?

మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు!

మీ అహంకారమే మీ పతనానికి కారణం!

Read Also : Suicidal Tendency : 6 – 8 ఏళ్ల వయస్సు పిల్లలూ ఆత్మహత్య చేసుకుంటున్నారు..! పిల్లలు ఆత్మహత్య చేసుకోవచ్చని ఎలా గుర్తించాలి..?