Site icon HashtagU Telugu

Sharmila Strong Counter To Jagan : జగన్ సైకో మనస్తత్వానికి ఇదో నిదర్శనం – TDP

Sharmila Letter

Sharmila Letter

జగన్ – షర్మిల మధ్య ఆస్థి తగాదాలు (Property disputes between Jagan and Sharmila) నడుస్తున్నాయని గత కొద్దీ నెలలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తగాదాలే షర్మిల – జగన్ మధ్య దూరం పెంచాయని ప్రచారం జరిగింది. ఈ తగాదాలను దృష్టి లో పెట్టుకొని..ఎన్నికల సమయంలో జగన్ (Jagan) పై షర్మిల (Sharmila) విరుచుకుపడింది. జగన్ ఓటమి కి షర్మిల కూడా ఓ కారణమని చెప్పచ్చు. తాజాగా షర్మిల తో పాటు తన తల్లి (Vijayamma) కి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ తరుణంలో, షర్మిల జగన్‌కు రాసిన లేఖ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది. ఈ లేఖలో షర్మిల , విజయమ్మ ఏమని అన్నారంటే..

‘మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను అంగీకరించనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే స్పష్టంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా’ అని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు.

‘మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం‌ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది’ సంయుక్త లేఖలో షర్మిల, విజయమ్మ పేర్కొన్నారు. ‘ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, ఎంఓయూలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే’ అని తెలిపారు.

‘నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటికవరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా తొక్కివేశారు. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం మేము ఒక పరిష్కారానికి అంగీకరించాం. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాన. ఆ విధంగా 31.08.2019న అమలు చేయబడిన ఒప్పందం ప్రకారం నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి’ అని షర్మిల వివరించారు.

‘ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ఆయన ఎన్నడూ కలలో కూడా మీరు ఊహించని పని చేశారు. చట్టబద్దంగా మీ కుటుంబసభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోడానికి సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు’ అని షర్మిల, విజయమ్మ తెలిపారు.

Read Also : Russia : ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ భేటీ