Site icon HashtagU Telugu

AP : వైసీపీ ని గెలిపించడం కోసం పాదయాత్ర చేసిన..వారికీ కనీసం కృతజ్ఞత లేదు – షర్మిల

Sharmila Tpt

Sharmila Tpt

గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం కోసం ఎండ , వానా ను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినప్పటికీ..ఈ రోజు కనీసం కృతజ్ఞత లేకుండా తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు పార్టీలను మూడు చెరువుల నీళ్లు తాగించేలా తన మాటలతో చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం తన దూకుడును కనపరుస్తుంది. తెలంగాణ లో ఎలాగైతే పార్టీ ప్రకటించి అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడిందో..ఇప్పుడు ఏపీలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. తన అన్న జగన్ చదివిన స్క్రిప్టే మళ్లీ మళ్లీ చదవి బోర్ కొట్టిస్తే..షర్మిల మాత్రం ఎప్పటికప్పుడు..ఏ వేదికకు ఆ వేదికగా స్క్రిప్ట్ ను చేంజ్ చేస్తూ అన్ని పార్టీల ఫై విరుచుకుపడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ..కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతూ రాష్ట్రంలో పార్టీ కి పూర్వ వైభవం తీసుకరావాలని పిలుపునిస్తుంది. తిరుపతి (Tirupati) జిల్లాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై వేసుకుని పాదయాత్ర చేశానని.. అండగా నిలబడి అధికారంలోకి తెచ్చినా, ఈ రోజు కనీసం కృతజ్ఞత లేదని అన్నారు. తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ వైస్సార్ బిడ్డ భయపడేది కాదని.. పులి కడుపున పులే పుడుతుందని, తన ఒంట్లో ఉన్నది వైఎస్ రక్తం అని పునరుద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని.. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని వచ్చి ప్రజలకు మేలు కలగాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. తన గుండెల్లో నిజాయితీ ఉందని.. ఎవరు ఎన్ని రకాల నిందలు వేసినా పర్వాలేదని అన్నారు. ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఎలాంటి త్యాగానికికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు ఇతర నేతలు పాల్గొన్నారు.

Read Also : Nitish Kumar Resigns as Bihar CM : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా