Polavaram Project Failures: పోల‌వ‌రంపై ఎవ‌రి వర్షన్ క‌రెక్ట్‌.. ష‌ర్మిల చెప్పిన‌ట్లు త‌ప్పు ఈ పార్టీల‌దేనా..?

  • Written By:
  • Updated On - June 30, 2024 / 02:56 PM IST

Polavaram Project Failures: ఏపీలో ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్‌. పోల‌వ‌రం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌తులు చేప‌ట్టారు. అయితే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే చేప‌ట్టిన మొద‌టి ప‌ర్య‌ట‌న పోల‌వ‌రం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌. ఇక‌పై ప్రతి సోమ‌వారం పోల‌వ‌రం వెళ్తాన‌ని మీడియా ముఖంగా చెప్పారు. అయితే గ‌త వైసీపీ ప్ర‌భుత్వం వ‌ల‌న పోల‌వరం ప్రాజెక్ట్‌కు తీవ్ర న‌ష్టం క‌లిగింద‌ని చంద్ర‌బాబు త‌రుపున వాద‌న‌.

మ‌రోవైపు మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి కాక‌పోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబే అని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతేకాకుండా త‌న‌కు పోల‌వరం ప్రాజెక్ట్ అర్థం కాలేద‌ని త‌న‌కే అర్థం కాకుంటే ఎవ‌రీ అర్థం కాద‌ని హాస్యస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 2029 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయ‌లేర‌ని చాలెంజ్ చేశారు. తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌న‌దైన శైలిలో స్పందించారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై త‌న ఆవేద‌న‌ను ట్వీట్‌లో తెలిపారు.

Also Read: Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్​లుగా క్లాస్‌మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్

ష‌ర్మిల ట్వీట్‌లో ఏం రాశారంటే.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ,టీడీపి,వైసీపీ పార్టీలే. ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయమయితే…పంతాలు పట్టింపులకు పోయి జీవనాడి పై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే… మోడీ సర్కార్ ఆ భాధ్యత 10 ఏళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపింది. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి పొలవారం,సోమవారం అంటూ హడావిడి తప్పా బాబు మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యం.

రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. మోదీ పిలక మీ చేతుల్లోనే ఉంది. కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది కాబట్టి.. పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా, పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని ఓ ట్వీట్ వేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

We’re now on WhatsApp : Click to Join